డియర్ రేఖ.. వాస్తవ సంఖ్య సమితి లాంటి నా జీవితంలోకి కల్పిత సంఖ్యలా చొరబడ్డావు. అప్పటినుంచి క్రమంభిన్నంలా సాఫిగా సాగే నా జీవితం అపక్రమ భిన్నానికి ఎక్కువ మిశ్రమ భిన్నానికి తక్కువలా మారింది. మనిద్దరి వయసులు సామాన్య నిష్పతిలో ఉన్నాయనుకున్నాను గానీ మన భావాలు విలోమానుపతంలో ఉన్నాయని తెలుసుకోలేకపోయా..
నువ్వు దక్కవని తెలిసినాక నా కన్నీళ్ల ఘనపరిమాణాన్ని కోలిచే పాత్ర లేదు. నా హృదయ వేదన వైశల్యానికి సూత్రం లేదు. నీతో సంకలనం ఇష్టాల వ్యవకలనమని, కష్టాల గుణకారమాని అంతం లేని ఆవర్తనం కానీ భాగహారమని తెలుసుకోలేకపోయా.. కానీ మన ప్రేమ సమీకరణం అనే సాధన లేని అసమీకరణాలు అవుతాయాని కలలో కూడా ఊహించలేదు.
నిరూపణ లేని సిద్ధంతానికి దాత్తంశం నువైతే సారాంశం నేనయ్యాను. నా ప్రమేయం లేకుండా నీతో ఏర్పడ్డ ఈ సంబంధం తుల్యసంబంధం కాకపోయినా.. కనీసం స్నేహ బంధమైన కాలేదు. ఇంతకాలం సమైఖ్య రేఖలా ఉన్న నువ్వు ఒక్కసారిగా సమాంతరారేఖగా ఎందుకు మారవో తెలియదు ? ఏది ఏమైనా అమ్మాయితో వ్యవహారం, సున్నాతో భాగహారం.. నిర్వచితం కాదని ఇన్నళ్లకు తెలుసుకున్నా..
ఇట్లు
నీ విఫల ప్రేమికుడైన గణిత లెక్చరర్.
అశోక్
చిట్లపల్లి, మహబూబ్ నగర్
ask9640@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
ఏందే అన్నా.. ఎట్లున్నా కష్టమేనా ?
అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?
Share this content: