Breaking
Tue. Dec 3rd, 2024

Amazon Great Indian Festival Sale : అద్భుతమైన ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

Amazon Great Indian Festival Sale 2024
Amazon Great Indian Festival Sale 2024

దర్వాజ – హైరాబాద్

Amazon Great Indian Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమవుతుంది. అయితే, ప్రైమ్ మెంబ‌ర్స్ కు ఒక రోజు ముందుగానే యాక్సెస్ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో 25,000 కొత్త ఉత్పత్తులు లాంచ్ అవుతాయి. అలాగే, 16 లక్షల కంటే ఎక్కువ విక్రేతల నుండి ఉత్పత్తులు అమ్మ‌కానికి అందుబాటులో ఉంటాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రధాన ఆఫర్లు:

స్మార్ట్‌ఫోన్లు – మొబైల్ యాక్సెసరీస్: స్మార్ట్‌ఫోన్లపై 40% వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. అలాగే, నో కాస్ట్ EMI ఆప్షన్లు, ఎక్సేంజ్ ఆఫ‌ర్లు కూడా ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్ : ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు. స్మార్ట్ టీవీల‌పై 65 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌లు ఉన్నాయి. అలాగే, బ్రాండెడ్ ల్యాప్ టాప్ ల‌పై కూడా 50 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ఆఫ‌ర్లు ఉన్నాయి.

హోమ్ ప్రోడక్ట్స్ : ₹199 నుండి ప్రారంభమయ్యే ధరలతో 2 లక్షల కంటే ఎక్కువ ఉత్పత్తులపై భారీగానే త‌గ్గింపు ధ‌ర‌లు ఉన్నాయి. కొన్ని ర‌కాల‌ రిఫ్రిజిరేట‌ర్లు, వాషింగ్ మిష‌న్ల‌పై 75 శాతం వ‌ర‌కు త‌గ్గింపులు ప్ర‌క‌టించింది. హోమ్ కిచ‌న్, ఔట్ డోర్ ప్రోడ‌క్టుల‌పై దాదాపు 50 శాతం త‌గ్గింపు ధ‌ర‌లు ఉన్నాయి.

అలెక్సా ఎనేబుల్డ్ డివైసెస్ : అలెక్సా స్మార్ట్ హోమ్ కాంబోపై 54% వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.

ఫ్యాషన్ : దుస్తులు, చెప్పులు, షూ స‌హా సంబంధిత ప్రోడ‌క్టుల‌పై 60 శాతం వ‌రకు త‌గ్గింపు ధ‌ర‌లు అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ పండ‌గ సేట్ ప్రత్యేక ఆఫర్లు:

బ్యాంక్ ఆఫర్లు: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్లను ప్ర‌క‌టించింది. ఖ‌చ్చిత‌మైన క్యాష్ బ్యాక్, త‌గ్గింపు ఆఫ‌ర్లు ఉన్నాయి.

యూపీఐ పేమెంట్స్: యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే అదనపు క్యాష్‌బ్యాక్‌లు కూడా ఉన్నాయి.

ప్రైమ్ మెంబర్స్: ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వ‌డంతో పాటు సేల్ ప్రారంభానికి ఒక రోజు ముందే వారికి యాక్సెస్ అందించింది.

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్ లో కొత్త లాంచ్‌లు:

ఈ సేల్‌లో 25,000 కొత్త ఉత్పత్తులు లాంచ్ అవుతాయి. ముఖ్యంగా, ఆపిల్, శాంసంగ్, సోనీ ప్లేస్టేషన్, షావోమి వంటి ప్రముఖ బ్రాండ్ల నుండి కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వ‌స్తున్నాయి.

Share this content:

Related Post