దర్వాజ-అమరావతి
AP Rains: ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. మరీ ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులువంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలో చెయ్యేరు నది పోటెత్తింది. దీంతో రామాపురం రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. కాగా ఈ వరద నీటిలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వందలాది పశువులు వరదలో కొట్టుకుపోయాయి.
కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు భారీ వరద కారణంగా కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా నందలూరు, రాజంపేట మండలాల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. చెయ్యేరు నది పరిసర ప్రాంతాలు జగ దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల్లో పలువురు కొట్టుకుపోయారని సమాచారం. కడప నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. చిత్తూరు లోని స్వర్ణముఖి నది అంచున ఉన్న నివాసాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. బగ్గెడేపల్లె, పులపుత్తూరు, మందపల్లె, పాపరాజుపల్లె తో పాటు మరికొన్ని గ్రామాలు పూర్తిగా నీటిలో ఉన్నాయి.
గండికోట రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని, మైలవరం రిజర్వాయర్ నుంచి పెన్నా నదిలోకి నీరు విడుదల చేయడం వల్ల ప్రవాహం ఉద్ధృతంగా మారే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. తిరుపతిలో ఇప్పటికీ కురుసస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంత ప్రజలను ఇప్పటికే సహాయ శిబిరాలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు విరిగిపడ్డాయి.
PM Modi: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తాం: ప్రధాని మోడీ
బాయిల్డ్ రైస్ కొనం.. : కేంద్రం
EY-Refyne Survey : నెల కాకముందే జీతం ఖతం..
Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?
ఈ పండుతో హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టొచ్చా?
Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..
కంటినిండా నిద్రపోతే పొట్ట కరుగుతుందా?
E-Shram: అసంఘటిత కార్మికుల్లో 20% రిజిస్ట్రేషన్