Breaking
Tue. Nov 18th, 2025

జర పైలం బిడ్డ.. !

corona lockdown poetry 1
corona lockdown poetry 1

ఇక కొట్టుడే కొట్టుడు
బడితె బెత్తల చప్పుడు
గీతలు దాటితే వాతలు
వినకపోతే కర్రసాములు.

రాత్రి నిషేధాలు వచ్చేశాయి
తొమ్మిది దాటేక లాఠీ పని
ఆపై నాదం ఝుంమ్మని
వంటిపై చేరును కందెనలు.

భయాన చిన్నపాటి లాఠీకర్ర
నిర్భయ కోసం పెద్ద దండన
జనమెరుగు గతానుభవం
లాక్డౌనులో లాఠీ విన్యాసం.

రేయంత ఇక నిషాదాలు
రేయ్అంటూ కర్ర పెత్తనాలు
కరోనా తుంచు యోచనలు
రాత్రంతా నిశీధి పొలికేకలు.

కర్రు గాల్చి పెట్టి వాతలు
జోడు పిర్రలపై ఎర్ర గీతలు
మాట వినని వారికి దండన
రేయిరాకన నడచు లాఠీన.

లాఠీయే రాజ్యమేలిక
కాఠిన్యమే చూపునిక
అడుగేయని నిశాచారి
ఇల్లే బహు పైలమోయి.

ashoka-chakravarthy-neelakantam-darvaaja.com_-775x1024 జర పైలం బిడ్డ.. !

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

Related Post