Breaking
Wed. Nov 13th, 2024

ఈ పాపం ఎవరిది ?

coronavirus crisis in india
coronavirus crisis in india
  • ఎవరిని, ఏమని నిందించాలి ?
  • నిండు పానం కళ్ళముందే పోతున్నా ఏమీ చేయలేని దుస్థితి.


“సారూ.. మా అయ్యకు వైద్యం చెయ్యుర్రి. లేకపోతే చంపేయండి.” అని వేడుకుంటున్నా.. పట్టించుకోని దుస్థితి.
కరోనా రోగులతో ఆసుపత్రులు, వారి శవాలతో స్మశానలు నిండిపోతున్నా.. ఒక ప్లాన్, పాడు చేసుకోని ప్రభుత్వాలు.
ప్రపంచ దేశాలు పాఠాలతో హెచ్చరిస్తున్నా.. ప్రార్థన మందిరాలు, బార్లు తెరిచి ఉంచిన వైనం.
కుంభమేళా లాంటి వాటికి అనుమతులు ఇవ్వడమే కాకుండా.. అక్కడకు పోతే కరోనా రాదని బల్లగుద్దిన పెద్ద మనుషులు.
ఆక్సిజన్ లేక పిట్టల్లా రాలిపోతున్న జనాలకు.. ఆవు మూతిలో మొఖం పెట్టి ఆక్సిజన్ పీల్చుకోండి అనే సెలెబ్రిటీ లు…

ఎవరిని ఏమని నిందించాలి !
75 పదులు నిండిన దేశంలో నేటికీ జానెడు పొట్టకోసం, కనీస ఆరోగ్య పరిస్థితుల కోసం, మంచి విద్య కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితులు మారేదెప్పుడు ? ఈ దేశంలో దోచుకుతినే వాడికి ప్రభుత్వాలు కల్పించే వసతుల్లో 1% సాధారణ జనాలకు కల్పేస్తే ఏమైతది ?

మాస్కులతో కరోనాని దూరం చేయలేము అని పలు దేశాలు చెప్పినా.. మాస్క్ పెట్టుకుంటే చాలు కరోనా రాదంటారు. అయినా మాస్క్ మూతి, ముక్కు కవర్ చేయకున్నా సరేనా..? జస్ట్ అలా తగిలించుకుంటే ఐపోతదా ?

ఆకలితో అలమటించే బతుకులు దేవుడిమీద కాకపోతే ఎవరిమీద భారం వేస్తాయి ?
గీ టైం లో భరోసాను ఇవ్వాల్సింది ప్రభుత్వాలు కాకపోతే మరెవరూ ?
మీకు ఓట్లు, నోట్లు లేకపోతే మనుషులు కనిపించరా ?
వారి జానేడు పొట్ట, ఆరోగ్యం మీకు గుర్తురాదా ?

పక్కదేశాలు వారి దేశస్తులను కాపాడుకోనికే అత్యవసర ప్రాతిపదికన హస్సిటల్స్ , సిబ్బంది ని పెంచుకుంటుంటే.. మనం ఏం చేస్తునం..?
చప్పట్లు కొట్టిస్తున్నం, గిన్నెలను బాధమంటున్నం, పూలను చల్లమంటున్నం.

గిట్లా చేస్తేనేనా.. కరోనా ఖతం అయ్యేది?
ఈ టైంలో పూజలు పునస్కారాలు కావాలా లేక ఆక్సిజన్ తో నిండిన ఆసుపత్రులు కావాలా ?
ఈ పాపం ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలదా ? లేక వాళ్ళను ఎన్నుకున్న ప్రజలందరిదా? దీన్ని ఆలోచించాలి. ఆచరించాల్సిన పనులను యాదికి పెట్టుకోవాలి. అడుగడుగున ప్రశ్నించాలి.. ప్రాణాలను కాపాడుకోవాలి.

shivudu-1 ఈ పాపం ఎవరిది ?

శివ‌లీల రాజమోని,
జ‌ర్న‌లిస్ట్,
రంగారెడ్డి.
rajamonishivaleela@gmail.com

Share this content:

Related Post