Loading Now
Covid-19 deatah WHO

కరోనాపై తప్పుడు లెక్కలు !

  • గ‌తేడాది క‌రోనా మ‌ర‌ణాలు 18 ల‌క్ష‌లు కాదు 30 ల‌క్ష‌లు
  • క‌రోనా లెక్క‌లు స‌రిగా వెల్లడించ‌ని దేశాలు
  • కోవిడ్‌-19 రోగుల‌ను గుర్తించ‌డంలో ఆయా దేశాలు విఫ‌లం
  • ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

గ‌తేడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచేసిన క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌టికీ యావ‌త్ ప్ర‌ప‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. రోజురోజుకూ త‌న ప్ర‌భావాన్ని పెంచుకుంటున్న క‌రోనా వైర‌స్ తీవ్ర స్థ‌యిలో విజృంభిస్తున్న ల‌క్ష‌ల మందిని బ‌లి తీసుకుంటోంది. అయితే, క‌రోనా పంజా విసురుతున్నా ప్ర‌భుత్వాలు స‌రైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో పాటు సంబంధిత వివ‌రాలు నమోదులోనూ నిర్లక్ష్యంగా ఉంటున్నాయ‌న‌నీ ఇప్ప‌టివ‌కీ అనేక దేశాల ప్ర‌భుత్వాల‌పై స్వచ్ఛంద సంస్థలు, ప్ర‌జ‌లు ఆరోపిస్తున్న సంగ‌తి తెల‌సిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా క‌రోనా మ‌ర‌ణాలపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) కీలక వ్యాఖ్యలు చేసింది. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30 ల‌క్ష‌ల మందిని క‌రోనా బ‌లితీసుకుని ఉంటుందంటూ అంచ‌నా వేసింది. ప్ర‌పంచ దేశాలు మాత్రం క‌రోనా గ‌ణాంకాల‌ను స‌రిగ్గా వెల్ల‌డించ‌కుండా… త‌క్కువ చేసి 18 లక్ష‌ల మంది మాత్ర‌మే చ‌నిపోయిన‌ట్టు చూపించాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొంది. గతేడాది డిసెంబ‌ర్ 31 నాటికి ప్ర‌పంచవ్యాప్తంగా 8.2 కోట్ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌నీ, మ‌ర‌ణాలు 18 లక్ష‌ల సంభ‌వించాయ‌ని గ‌ణాంకాలు చూపుతున్నాయి.

అయితే, కరోనా మరణాలను ఆయా దేశాలు వెల్ల‌డించిన దానికంటే 12 లక్ష‌లు అధికంగా సంభ‌వించి వుండ‌వ‌చ్చు. ఎందుకంటే క‌రోనా నిర్ధార‌ణ అయి ఆస్ప‌త్రులు, ఇండ్ల‌ల్లో చికిత్స పొందుతున్న వారి మ‌ర‌ణాల‌నే ప్ర‌భుత్వాలు లెక్క‌లోకి తీసుకున్నాయి. క‌రోనా నిర్ధార‌ణ కాక‌ముందే చాలా మంది చ‌నిపోయార‌ననీ, వారిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇదే స‌మ‌యంలో క‌రోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం కార‌ణంగా కూడా అనేక మంది చ‌నిపోయార‌ని తెలిపింది.

Share this content:

You May Have Missed