Breaking
Sat. Jun 28th, 2025

కుండ‌పోత వ‌ర్షం.. నీట‌మునిగిన హైద‌రాబాద్

Cyclone Gulab hyderabad
Cyclone Gulab hyderabad

• తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వాన‌లు
• 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్.. అప్ర‌మ‌త్త మైన ప్ర‌భుత్వం

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్
Cyclone Gulab hyderabad: గులాబ్ తుఫాను ప్ర‌భావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వాన‌ల‌తో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాత‌బ‌స్తీలో ప‌రిస్థితి దారుణంగా మారింది. న‌డుము మ‌ట్టం వ‌ర‌కు నీరు రోడ్ల‌పై నిలిచిపోవ‌డం అక్క‌డి ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. దీందో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప‌లు ప్రాంతాల్లో భారీ మోట‌ర్ల‌తో నీటిని తొల‌గించే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

సోమ‌వారం ఉద‌యం నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాలతో మంగ‌ళ‌వారం వ‌ర‌కు ఇదే వాతావ‌ర‌ణం కొన‌సాగే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇండ్ల నుంచి ప్ర‌జ‌లేవ్వ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌ద‌నీ, ఇబ్బందులు ఎదురైతే వెంట‌నే అధికారులు స‌మాచారం అందించాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది. దీని కోసం ప్ర‌త్యేక హెల్ప్ లైన్ అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. హైదరాబాదులో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు.. సహాయం కోసం 040-23202813 నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

ఇదిలావుండ‌గా, గులాబ్ తుఫాను ప్ర‌భావం తెలంగాణ‌పై కొన‌సాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల‌ను హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ విభాగం.. 14 జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ ను ప్ర‌క‌టించింది. వాటిలో నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్ధిపేట, సిరిసిల్ల, జనగామ, పెద్దపల్లి, హన్మకొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచ‌నా వేసింది.

భార‌త్ బంద్

పొంచివున్న ‘గులాబ్‌’ ముప్పు

https://darvaaja.com/cyclone-gulab/embed/#?secret=Ds6s0ZzND7

పెగాస‌స్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మ‌మ‌త ఫైర్

బాలిక‌పై 30 మంది లైంగిక‌దాడి

ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత

పంజా విసురుతున్న డెంగ్యూ

మేఘాల్లో విహరిస్తున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే?

తెలంగాణ విమోచన దినం

Related Post