Loading Now
Dangerous Impacts of Smartphones and tvs for Teenagers

టీవీ, మొబైల్స్.. డెంజ‌ర్‌లో టీనేజ‌ర్స్ !

కాలం ముందుకు సాగుతున్న క్ర‌మంలో సైన్స్ అండ్ టెక్నాల‌జీలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. మ‌రీ ముఖ్యంగా టెక్నాల‌జీ సంచ‌ల‌న మార్పుల‌తో మానవ జీవితం గ్యాడ్జెట్ల‌‌తో వీడ‌దీయలేని బంధంగా మారిపోయింది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు నిత్య‌వ‌స‌రాలుగా మారిపోయాయి. అయితే, ఈ టీవీలు, స్మార్ట్ ఫోన్లు టీనేజ‌ర్స్ లో డెంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయ‌ని తాజాగా ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

జర్నల్ ఆఫ్ యూత్ అండ్ అడోలసెన్స్ లో ప్ర‌చురించ‌బ‌డిన ఈ అధ్య‌య‌నం వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్ర‌స్తుత కాలంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన టీవీలు, స్మార్ట్ ఫోన్లు క‌నిపిస్తూన్నాయనటంలో అతిశ‌యోక్తి లేదు. అయితే, వీటివ‌ల్ల టీనేజ‌ర్స్ అధికంగా ప్ర‌భావిత‌మ‌వుతున్నారు. ఈ గ్యాడ్జెట్ల‌కు టీనేజీ పిల్ల‌లు బానిస‌లుగా (అడిక్ట్) మారుతున్నారు. దీని కార‌ణంగా మొబైల్‌, టీవీల‌లో గేమ్స్ అడుతూ రోజంతా దానితో పాటు గ‌డుపుతున్న వారు అధికంగా ఉన్నారు. టెక్నాల‌జీ గురించి తెలుసుకోవ‌డం అతిముఖ్యమే అయిన‌ప్ప‌టికీ.. అతిగా వాడ‌టం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఈ అధ్య‌య‌నం హెచ్చిరించింది.

yyyyy టీవీ, మొబైల్స్.. డెంజ‌ర్‌లో టీనేజ‌ర్స్ !

స్మార్ట్ ఫోన్, టీవీల స్క్రీన్ చూస్తూ చాలా స‌మ‌యం గ‌డుపుతున్నారు. ముఖ్యంగా గేమ్స్ అడుతూ.. వాటికే అతుక్కుపోవ‌డం వ‌ల్ల మాన‌సిక రోగాలు వ‌స్తున్నాయ‌ని ఈ అధ్య‌యనం గుర్తించింది. దీనికి కార‌ణంగా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న టీనేజ‌ర్ల సంఖ్య పెరుగుతోంది. 13 నుంచి 19 ఏండ్ల పిల్ల‌ల‌పై దాదాపు 10 ఏండ్లు (2019లో ప్రారంభం) ఈ అధ్య‌య‌నం జ‌రిపారు. యుక్త వ‌య‌స్సు పిల్ల‌ల్లోనూ ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు పెరుగుతున్నాయ‌ని తెలిపింది. వినోద యాప్‌ల‌ను అతిగా వాడ‌టం అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతోందని హెచ్చ‌రించింది.

ఈ అధ్య‌య‌నం పై బ్రిగ్హామ్ యంగ్ వ‌ర్సీటీకి చెందిన ప్రొఫేస‌ర్ సారా కోయెన్ మాట్లాడుతూ… టీనేజ‌ర్స్ అతిగా మొబైల్‌, టీవీల‌కు అతుక్కుపోవ‌డం వ‌ల్ల వారి కుటుంబ సభ్యుల‌తో స‌మ‌యాన్ని కేటాయించ‌లేక‌పోతున్నారు. దీని కార‌ణంగా వారి ఆలోచ‌న‌ల్లో మార్పులు చోటుచేసుకునీ, వారిలో అత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లు పెంచుతాయ‌ని తెలిపారు. సోష‌ల్ మీడియాలో టీనేజ‌ర్స్ అప్ లోడ్ చేసిన ఫోటోలకు, వీడియోలకు లైక్స్, కామెంట్లు రాకపోతే ఆత్మనూన్యతా భావానికి లోనవుతున్నార‌నీ, వారు ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌కుండా త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

కోమ‌ల‌మైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!

వాట్సాప్ లో ఇక మెసేజ్ చేయలేరు !

దేశంలో పెట్రో మంట‌లు.. వరుస‌గా 12వ రోజు పెరిగిన ధ‌ర‌లు

మేడారం జాతర‌కు వేళాయ‌రా..!

Share this content:

You May Have Missed