ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5,270 కేసులు నమోదు
2015 తర్వాత ఇదే అత్యధికం: ప్రభుత్వ నివేదిక
దర్వాజ-న్యూఢిల్లీ
Dengue cases in Delhi: దేశరాజధాని ఢిల్లీలో డెంగ్యూ కలకలం రేపుతోంది. అక్కడ రికార్డు స్థాయిలో కొత్త కేసులు అంతకంతకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 5,270 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ ఢల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నివేదిక పేర్కొంది. 2015 తర్వాత ఢల్లీలో నమోదైన అత్యధిక డెంగ్యూ కేసులు ఇవే కావడం గమనార్హం. ఇదిలావుండగా, గత వారం రోజుల్లోనే దాదాపు 2,570 కొత్త కేసులు నమోదుకావడం డెంగ్యూ విజృంభణకు అద్దం పడుతోంది.
నగర మున్సిపల్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం నవంబర్ 13 వరకు ఈ సీజన్‌లో 5,277 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2016-2020 మధ్య కాలంలో పోలిస్తే ఈ ఏడాదిలో నమోదైన కేసులు అత్యధికం కావడం గమనార్హం. ఇదివరకటి సంవత్సరాల్లో నమోదైన డెంగ్యూ కేసుల వివరాలు గమనిస్తే 2016లో 4726 కేసులు, 2018లో 2798 కేసులు, 2019లో 2036 కేసులు, 2020లో 1072 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుండగా, డెంగ్యూ కారణంగా ఇప్పటివరకు డజను మరణాల సంభవించిననట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఢల్లీలో నెలకొన్న ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా పరిస్థితులు మరింత ఆందోళకరంగా మారే అవకాశమూ లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు.
చలికాలమని నీళ్లు తాగకుండా ఉంటున్నారా?.. అయితే మీ పని అంతే..
T20 World Cup: నయా ఛాంపియన్ ఆస్ట్రేలియా
బట్టతల ఉందని బాధపడుతున్నారా.. ? అయితే మీకో గుడ్ న్యూస్..
పిల్లలపై 400 శాతం పెరిగిన సైబర్ నేరాలు
‘కాప్26లో పాల్గొనకపోవడానికి ప్రభుత్వ యంత్రాంగమే కారణం’
ఆవు పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Samantha : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో సమంత చిందులు !
2 లక్షల జీతం కానీ.. 30 వేలకు కక్కుర్తిపడి.. చివరకు..?