Breaking
Sat. Jun 28th, 2025

ఇది ఆలోచించాల్సిన టైం

మీరు ఒక ఇంజినీరో.. ఒక క‌లెక్ట‌రో.. ఒక డాక్ట‌రో.. ఒక యాక్ట‌రో.. ఒక కండెక్ట‌రో అయితే మీరు మీ కుటుంబం బాగు ప‌డదు. ఎందుకంటే.. మీ సంపాద‌న ఇంట్లో ఉండే వ‌ర‌కే ఉప‌యోగ‌ప‌డుతుంది. అడుగు బ‌య‌ట పెట్టారో.. అంతా మారిపోతుం‌ది. అన్యాయాలు, అక్ర‌మాలు, దోపిడిలు, హ‌త్యాచారాలు, మాన‌భంగాలు.. ఇలా ఏ ఒక్క‌టిని మీరు స‌రి చేయ‌లేరు, మార్చ‌లేరు.

మీకు మీ అమ్మ అయ్యలు.. బువ్వ పెట్టి, స‌దువు నేర్పించొచ్చు. కానీ మీరు ఒక‌ ప్ర‌యోజ‌కుడు అయ్యారంటే మాత్రం మీ వాళ్ల‌కంటే ఎక్కువ బాధ్య‌త తీసున్న‌ది మాత్రం సొసైటీనే. ఆ సొసైటీలో ఎదురింటి సుబ్బ‌మ్మ‌, పక్కింటి పార్వ‌త‌మ్మ‌, ప‌క్క‌సందు సాయిలు, ప‌క్కురి ప‌ర్వ‌తాలు ఇలా ఎంద‌రో ఉన్నారు. ఒక‌రు నీలో ఉన్న ప్ర‌త్యేక‌త‌ను గుర్తించి నిన్ను ప్రోత్స‌హిస్తే.. ఇంకొంద‌రు నువ్వు ఎక్క‌డా పొంగిపోయి చేత‌కాకుండా ఉంటావో.. అని నిన్ను హేల‌న చేశారు. కొంద‌రు తెలిసి.. మ‌రి కొంద‌రు తెలియ‌క త‌ప్పులు చేశారు. చేస్తున్నారు.

think-first1 ఇది ఆలోచించాల్సిన టైం

భిక్ష‌గాళ్ల‌కు ఒక్క‌రూపాయి ఇచ్చి.. గొప్ప ప‌ని చేసిన అనుకునే స‌మాజంలో మ‌నం బ్ర‌తుకుతున్నాం. ఒక్క‌రూపాయితో ఆ పూట మాత్ర‌మే త‌న పొట్ట నిండుత‌ది రేపు మ‌ళ్లీ వాళ్లు ఇదే ప‌ని చేయాలిక‌దా.. దాన్ని పూర్తి మార్చాలంటే ఏం చేయాల‌ని ఆలోచించే నాథులే లేకుండా పోతున్నారు. అయితే వీట‌న్నింటికి మూలం, మార్గం ఒక‌ద‌గ్గ‌ర దాగి ఉంది.

దాన్ని గుర్తిస్తే.. దాన్ని స‌క్ర‌మంగా వాడుకుంటే.. దేశం నీకు ఏమిచ్చిందో అంత‌కు మించి ఈ దేశానికి ఇచ్చిన వాడివి అవుతావు. అది ఏదో మీ తాత‌ల ఆస్తి పాస్తుల కావు.. నువ్వు సంపాదించిన కారు బంగ్లా కానే కాదు.. కేవ‌లం నువ్వు రూ. 500ల‌కు అమ్ముకునే ప‌నికిరాని ఓటు మాత్ర‌మే. ఆ ఒక్క ఓటును ఫైస‌లు ఇచ్చినోడికి కాకుండా ప‌ని చేసేటోనికి వేసి చూడు.. ఆ మార్పుతో నువ్వు డాక్ట‌రుగా, క‌లెక్ట‌ర్ గా, కండెక్ట‌రుగా చేయ‌లేని ప‌నుల‌న్ని ఇట్టే అయిపోతాయి.

think-first2 ఇది ఆలోచించాల్సిన టైం

ఒక మంచి లీడ‌ర్ తో దేశం పురోగ‌మ‌నం వైపు ప్ర‌యాణం చేస్తుంది. అదే ఒక ప‌నికిమాలిన లీడ‌ర్ తో దేశం తిరోగ‌మ‌నంలోకి నెట్ట‌ప‌డుతుంది. అందుకే కుల‌, మ‌త‌, జాతి, లింగ బేధం లేకుండా ఓటు వేసే ప్ర‌య‌త్నం మీరు చేస్తే.. ఈ దేశానికి గొప్ప సేవ చేసిన వాళ్లు అవుతారు. తెలియ‌ని వారికి తెలిసేలా చెబితే.. మీ పిల్ల‌ల భ‌విష్య‌త్తును గొప్ప‌గా మ‌లిచిన వారు అవుతారు.

ఏం చేయాలి

ఒక్క‌టి గుర్తుంచుకోండి ఎంత సంపాదించినా.. ఈ సొసైటీలో మీ పిల్ల‌ను తిర‌గాల్సిందే.. వాళ్ల బాగు కోస‌మైనా మీరు మీ ఓటును అమ్ముకోకండి. దానికి మీరు “మా ఓటు అమ్మబ‌డ‌దు” అని టాగ్ వేసుకుని తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు. పోలింగ్ బూత్ లోకి పోగానే.. ఫైస‌లు ఇచ్చినోడికి ఓటు వేయ‌కుండా ఉంటే స‌రి.. ఫైస‌లు ఇచ్చినోడు ఫైస‌లు వ‌సులు చేసుడే చేస్తాడు కానీ.. స‌మాజ మార్పుకు ఎలా కృషి చేస్తాడు.? ఇన్ని రోజులు ఆలోచించ‌కుండా ఉన్న మీ మెద‌డుకు ప‌దును పెట్టి.. మార్పుకు శ్రీకారం చుడ‌తార‌ని ఆశిస్తున్నాము. మీరు వేసే ఈ విలువైన ఓటు.. స‌మాజ మార్పుకు నాంధి ప‌ల‌కాల‌ని కోరుతూ..

– ఎడిటర్ (ద‌ర్వాజ.కామ్)

think-first3 ఇది ఆలోచించాల్సిన టైం

చివ‌రి ఘ‌డియ‌లు

ఓటుకు నోటు త‌ప్ప‌క‌ తీసుకోవాల్సిందే..!

మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

మ‌నం మారేదెప్పుడు ?

Related Post