Sat. Dec 21st, 2024

మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

End the dowry system
End the dowry system
పెళ్లి అంటే.. ఆకాశమంత పందిరి.. భూదేవంత.. అరుగులు.. మూడు ముళ్లు.. ఏడడుగుల బంధమే కాదు.. తాను బ్రతికినంత కాలం నీకు తోడూ నీడగా ఉంటానంటూ ఆమె వేసే మొదటి అడుగు. నీ సంతోషంలో తానూ భాగమై.. నీ ప్రతి కష్టంలో నేను కూడా తోడున్నానంటూ నిన్ను నడిపించే నీ నేస్తం. ఆలిగా.. అమ్మగా.. నేస్తంలా.. ఒక బంధువులా.. నీ ప్రతి మూమెంట్ లో అన్ని తానై నిలుస్తూ ఉండే దేవత.

25 ఏండ్ల పాటు ఇష్టంగా పెంచిన కన్న తల్లిదండ్రులను కూడా వదిలేసి నువ్వే నా ప్రపంచం అంటూ నీతో కొత్త జీవితానికి సిద్దమవుతుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను యువరాణిని చేసి నీ చేతిలో పెడతారు. గుండె పగిలే దు:ఖం వచ్చినా.. అవన్నీ లెక్కచేయకుండా అల్లుడు మంచిగా చూసుకుంటే చాలు.. నా తల్లి సంతోషంగా ఉంటే అదే మాకు నిండు నూరేళ్లు అని భావిస్తారు తల్లిదండ్రులు.

కానీ ఒక అమ్మాయి పెళ్లి అనంతరం 100 శాతం సాఫీగా సాగే జీవితాలు ఉన్నాయా? అంటే.. ముమ్మాటికీ లేదనే చెప్పుకోవాలి. పెళ్లి ఎలాగోలా చేసినా.. పెళ్లి తర్వాత ఆమె పడే బాధలు ఎవరికీ చెప్పుకోనివి. అమ్మాయి పెద్దగా అయ్యిందంటే చాలు తమ తల్లిదండ్రులు ఎన్నో ఎన్నెన్నో కలలు గంటారు. నా బిడ్డకు ఇలాంటి వరుడుని తేవాలి.. మంచి మనసున్న మారాజును రావాలంటూ అనుకుంటారు.

End-the-dowry-system-5 మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

ఏది తెచ్చిపెట్టకున్నా సరే.. దాన్ని కంటికి రెప్పలా.. సంతోషంగా ఉంచితే చాలు అనుకుంటారు. ఇది ఒకప్పటి ముచ్చట. ఇప్పడు తమ బిడ్డ పెద్దగైందంటే చాలు.. ఎక్కడ కోట్లు అడిగే అల్లుడు వస్తడో అని బెంగపెట్టుకుని గుండెపోటు తెచ్చుకుని ప్రాణాలు విడిచిన తల్లిదండ్రులు చాలా మందే ఉన్నారు. నాడు పెళ్లిల్లు అమ్మాయి గుణంలో మంచిగా ఉంటే చాలుకునే వారు. కానీ నేడు అలాంటి రోజులు మచ్చుకైనా కనిపించడం లేదు.

నేటి రోజుల్లో అమ్మాయికి పెళ్లిల్లు చేయాలంటే కావాల్సింది.. లక్షలు, కోట్లు మాత్రమే. అవి ఉంటేనే నేటి తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిల్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత గొప్ప చదువులు చదువుకున్నా.. ఎంతటి సంస్కార వంతుడైనా.. పెళ్లి అంటే కోట్లు పుచ్చుకోవాల్సిందే.. తమ స్థోమతకు మించి ఇచ్చుకున్నా.. ఇది తక్కువ చేశారు.. మా ఫ్రెండ్ కు అంత పెట్టారు.. నాకేంటి ఇంత చీప్ గా.. మీరు వద్దూ.. మీ అమ్మాయి వద్దంటూ పెళ్లి పీఠల మీద నుంచే వెళ్లిపోయిన వారు లేకపోలేదు. కానీ ఒక అమ్మాయి పెళ్లికి ఆ తల్లిదండ్రులు కట్నం కోసం ఎంత కష్టం చేస్తారో మీకు ఎరుకనా.. కడుపుకు సరైన తిండ కూడా లేకుండా.. రూపాయి రూపాయి పోగు చేసి ఒక దగ్గర చేర్చితే.. ఇవి చాలవు కోట్లు కావాలంటే.. వాళ్లు ఎక్కడి కెంచి తేవాలి.. డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా.. సంపాదించే వాడికే తెలుస్తుంది రూపాయి విలువేంటో..

End-the-dowry-system-darvaaja.com_ మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

నువ్వు పెళ్లి చేసుకునేది డబ్బును చూసా?.. లేక అమ్మాయిని చూసా?.. దర్జాగా ఎలాంటి కష్టం లేకుండానే డబ్బులు వస్తున్నాయనే చేసుకుంటున్నావా పెళ్లి?.. లేకపోతే.. నీ వాళ్ల ముందు నేను ఇంత డబ్బులకు అమ్ముడు పోయానురా అని చెప్పుకోవడానికా? అసలు నీకు కట్నం దేనికి?.. ఏ అవసరాలను తీర్చుకోవడానికి కట్నం కావాలి నీకు. కట్నం తీసుకుని వాటితోనే కలకాలం బ్రతుకును ఈడుస్తావా.. మీ ఈ వరకట్న దాహంతో ఎంత మంది అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నారో తెలుసా?

పాపం.. నిన్న గాక మొన్నే ఓ అమ్మాయి వరకట్న దాహానికి బలైంది. కట్నం ఇచ్చుకునే స్థోమత వాళ్లకు లేదు. అమ్మాయి చూడముచ్చటగా ఉంది. అయినా.. పెళ్లి చేసుకునే వారే కరువయ్యారు. ఎందుకో తెలుసా.. కేవలం.. కేవలం కట్నం ఇవ్వనందుకే ఆమెను చేసుకోవడానికి ముందుకు రాలేదు ఈ సిగ్గుమాలిన సమాజం. 28 ఏండ్లు నిండినయి ఇంకెప్పుడు పెండ్లి చేస్తరు అని సమాజంలో పోరు.

End-the-dowry-system3 మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

వీళ్ల బాధను భరించలేక ఆ తల్లిదండ్రులు కట్నం ఇస్తామని పెళ్లిని ఖాయం చేశారు. సమాజం సాయం చేస్తుందని కట్నం ఇస్తామని మాటిచ్చినా.. కానీ తీరా పెళ్లి దగ్గరకు వచ్చాక వారికి డబ్బులు ఇచ్చేవారే కరువయ్యారు. ఆ దీన స్థితిని తట్టుకోలేక..ఆ తల్లి తన ఇద్దరు కూతుర్లు పురుగుల మందును తాగి చనిపోయారు. వీరి చావుకు కారణం ఏంటి.. కట్నం. కేవలం కట్నం కోసమే ఎంతో మంది బలవుతున్నారు.

వీరి సంగతి ఇట్లుంటే.. లక్షలు, కోట్ల కట్నం ఇచ్చి పెళ్లిల్లు చేస్తే.. తీరా పెళ్లి అయ్యాకా.. నాకింకా కట్నం కావాలి అంటూ పెళ్లైన మరుసటి రోజునుంచే కట్టుకున్న భర్త నుంచి అత్తామామల హింసలు పడుతున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఈ అదనపు వరకట్నం బాధను తట్టుకోలేక ఎంతో మంది మహిళలు ప్రాణాలు తీసుకుంటున్నారు. న్యాయాన్ని చెప్పాల్సిన ఫ్యామిలీ ఇంట్లోనే వరకట్న వేధింపులు ఎదురవుతున్నాయి.

మీర్ పేట్ కు చెందిన ఓ మహిళ లాయర్ గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నా ఆమెకు వరకట్న వేధింపులు వచ్చాయి. న్యాయం చెయ్యాలంటూ ఆమె పోలీసులకు ఆశ్రయించిన ఘటన తెలిసిందే. అలాగే ఓ మహిళా పోలీసు అధికారి కూడా తన భర్త నుంచి వరకట్న వేధింపులు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటుగా మొన్నటికి మొన్న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 23 ఏండ్ల యువతి శబర్మతి నదిలో దూకి ఆత్మ హత్య చేసుకుంది. పెళ్లికి లక్షల కట్నం ఇచ్చినా.. పెళ్లైన తర్వాతి రోజు నుంచే వరకట్న వేధింపులు వచ్చాయి. ఆమె బ్యాంకులో పనిచేస్తోంది. అయినా.. కట్నం కావాలంటూ.. శారీరక, మానసిక ఇబ్బందులను తట్టుకోలేక ఆమె ఈ దారుణానికి పాల్పడింది.

End-the-dowry-system మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

అలాగే కట్నం కావాలంటూ నిత్యం భర్త వేధింపులను తట్టుకోలేక ఎంతో మంది మహిళలు పోరాడలేక.. చివరికి మరణమే శరణ్యమంటూ ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో. చెప్పుకుంటూ పోతే.. పేజీలు సరిపోవు.. ఈ వరకట్న దాహానికి ఎంత మంది బలయ్యారో. ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు. ఇప్పటికైనా డబ్బు దాహంతో సాగుతున్న మీ ఆలోచన విధానానికి పుల్ స్టాప్ పెట్టండి. పెళ్లంటే కట్నం తీసుకోవడం గొప్ప అనే విషయాన్ని చెత్త కుప్పలో పడేయండి. పెళ్లంటే నీ సంతోషానికి.. నీ దుఖనానికి ఎల్లప్పుడూ నీకు తోడూ నీడగా ఉండే నీ భార్య అని భావించండి. గొప్పలకు పోయి ఇంత కట్నం కావాలంటూ అమాయకులైన అమ్మాయిల ప్రాణాలను తీయకండి ప్లీజ్..

shivudu-1-150x150 మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

శివ‌లీల రాజమోని,
జ‌ర్న‌లిస్ట్,
రంగారెడ్డి.
rajamonishivaleela@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

లెక్కలకు పోరగాడి లేఖ

ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత!

మేకల డాన్స్.. సోషల్ మీడియా షేక్ !

జోరుగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోరు

శ్రమ దేవోభవ

Share this content:

Related Post