దర్వాజ-న్యూఢిల్లీ
- సంతోషం లేని టాప్-10 దేశాల జాబితాలో చివరి నుంచి నాల్గో స్థానంలో భారత్
- ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ ఎందుకుంది?
- తాజా వరల్డ్ హ్యపీనెస్ రిపోర్టులు ఏం చెబుతున్నాయి?
దేశ అభివృద్ధి ఏ స్థాయిలో ఉన్న అక్కడి పౌరులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారా? లేదా? అనే అంశం అత్యంత ప్రధానమైనది. దీనిని ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. అయితే, ఒక వ్యవస్థగా పరిగణలోకి తీసుకుంటే అక్కడి సామాజిక పరిస్థితులు, అధిక నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక పరిస్థితులు, ఉపాధి, వేతన వృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం, పరిశుభ్రమైన వాతావరణం వంటి పరిస్థితులు సంతోషాన్ని నిర్ణయిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలి కాలంలో కరోనా వైరస్ సృష్టించిన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు అన్ని దేశాలు ఆర్థికంగా కూదేలయ్యాయి. అయితే, ఇలాంటి అడ్డంకులకు ఎదురొడ్డి నిలిచి.. ప్రపపంచంలో చాలా సంతోషకరమైన దేశాలుగా పలు దేశాలు తమ ఘనతను చాటుకున్నాయి. దీనికి సంబంధించిన జాబితాను ‘ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్’ తాజాగా విడుదల చేసింది. “వరల్డ్ హ్యపీనెస్ రిపోర్టు”లో మొత్తం 149 దేశాలున్న ఈ జాబితాలో భారత్ 139 స్థానంలో ఉంది.

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ‘సంతోషం కరువైన చివరి పది దేశాల్లో భారత్ ఉండగా.. దిగువ నుంచి నాల్గో స్థానంలో ఉంది. దీనిని బట్టి దేశంలో సంతోషం, ఆనందం అనేది గాలి మాటలుగానే మిగిలిపోయాయని తెలుస్తోంది. భారత్ కంటే తక్కువ స్కోర్ పొందిన దేశాలు మూడు మాత్రమే ఉన్నాయి. అవి జోర్డాన్, టాంజానియా, జింబాబ్వే.
ప్రపంచంలో సంతోషం కరువైన టాప్-10 దేశాలు
- జింబాబ్వే-స్కోరు: 3.160
- టాంజానియా-స్కోరు: 3.786
- జోర్డాన్- స్కోరు: 4.094
- భారతదేశం-స్కోరు: 4.225
- కంబోడియా-స్కోరు: 4.377
- బెనిన్-స్కోరు: 4.408
- మయన్మార్-స్కోరు: 4.431
- నమీబియా-స్కోరు: 4.451
- ఈజిప్ట్-స్కోరు: 4.472
- కెన్యా-స్కోరు: 4.547

అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. వరుసగా నాల్గో ఏడాది కూడా ఈ జాబితాలో టాప్ ప్లేస్ సంపాదించడం విశేషం. ఈ జాబితాలో టాప్-10 దేశాలు యూరోపియన్ దేశాలే ఉండటం గమనార్హం. ఇందులో వరుసగా ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు టాప్-5 లో ఉన్నాయి.
యూకే 17, అమెరికా 19, జర్మనీ 13, ఫ్రాన్స్ 21వ స్థానంలో ఉన్నాయి. కాగా, ఆయా దేశల జీడీపీ, సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేస్తారు. గత మూడు సంవత్సరాల కాలంలో సంబంధిత దేశంలోని పనితేరును పరిగణలోకి తీసుకుని ర్యాంకులను కేటాయిస్తారు.
దీనిపై ఐరాస పరిశోధకుడు హిల్లివెల్ మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి కాలంలోనూ.. ఫిన్లాండ్ ఎక్కువ శాతం జనాభా ఆనందంగా జీవిస్తున్నారు. వారు కరోనా టైంలో వారి జీవనోపాధిని కాపాడుకొనేందుకు అధిక మొత్తంలో కృషి చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారనే విషయం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఫిన్లాండ్ లో విస్తారమైన అడవులు, వేలాది సరస్సులు , ప్రశాంతమైన వాతావరణం ఉండటం ప్రజల జీవనానికి అనుకూలం ’అని హిల్లివెల్ వెల్లడించారు.

ప్రపంచంలో సంతోషకరమైన టాప్ 20 దేశాలు
- ఫిన్లాండ్
- డెన్మార్క్
- స్విట్జర్లాండ్
- ఐస్లాండ్
- నెదర్లాండ్స్
- నార్వే
- స్వీడన్
- లక్సెంబర్గ్
- న్యూజీలాండ్
- ఆస్ట్రియా
- ఆస్ట్రేలియా
- ఇజ్రాయెల్
- జర్మనీ
- కెనడా
- ఐర్లాండ్
- కోస్టా రికా
- యునైటెడ్ కింగ్డమ్
- చెక్ రిపబ్లిక్
- యునైటెడ్ స్టేట్స్
- బెల్జియం
పంచాయతీ కార్యదర్శులంటే ఎందుకంత చులకనా ?
రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ బడ్జెట్
శ్రీవారి కళ్యాణం.. కమనీయం! దేవుని పడకల్ జాతర
మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?
