Breaking
Tue. Dec 3rd, 2024

Fire breaks: జ‌మ్మూకాశ్మీర్ లో భారీ అగ్ని ప్ర‌మాదం !

jammu kashmir fire accident
jammu kashmir fire accident

Fire breaks: జమ్మూ కాశ్మీర్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. శ్రీనగర్‌లోని రాజ్‌బాగ్ ప్రాంతంలోని వాణిజ్య భవనంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. మంట‌లు ఆర్పుతున్న క్ర‌మంలో అగ్నిమాపక అధికారి ఒకరు గాయపడ్డారు. సిలిండ‌ర్ పేలుడుతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు అధికారులు.

శ్రీనగర్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికారిని మాట్లాడుతూ.. గురువారం ఉదయం 11.55 గంటల ప్రాంతంలో ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌నీ, అగ్నిమాపక సిబ్బంది వెంట‌నే ఘటనా స్థలానికి చేరుకుని మంట‌ల‌ను అదుప‌లోకి తీసుకొచ్చార‌ని తెలిపారు. భవనంలో ఉన్న వారందరినీ ఖాళీ చేయించామ‌నీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదం కార‌ణంగా భవనం పై భాగం భారీగా దెబ్బతింది. వాణిజ్య భవనంలో అనేక కార్యాలయాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను ఆర్పే సమయంలో గాయ‌ప‌డిన ఫైర్ టెండర్‌ను తదుపరి వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Share this content:

Related Post