దర్వాజ-కోల్ కతా
ఒక్క ట్వీట్ నుంచి జైలు ప్రయాణం వరకు: పూణె న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలి అరెస్ట్ కథనం
సోషల్ మీడియా ఓ శక్తివంతమైన వేదిక. అది వ్యక్తిత్వాన్ని అభివ్యక్తి చేసే మార్గం అయితే, అదే వేదిక భావోద్వేగాలను ద్రవించే, చట్టపరమైన చర్యలకు దారితీసే వేదికగా కూడా మారుతుంది. తాజాగా ఈ విషయాన్ని నిరూపించిన సంఘటన, 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పానోలి అరెస్ట్ కేసు.
ఎవరీ శర్మిష్ఠ? ఏం జరిగింది?
శర్మిష్ఠ పానోలీ, పూణెలోని ప్రతిష్టాత్మక సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో న్యాయ విద్య చదువుతున్నారు. ఆమెకు X (పూర్వ Twitter)లో 85,000 మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 90,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మే 14న AIMIM జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ ఆమె పోస్టు చేసిన ఓ వీడియోను పంచుకుంటూ, అది ఇస్లాం మతాన్ని అవమానించేలా ఉందని ఆరోపించారు. వెంటనే హోం మంత్రిని ట్యాగ్ చేస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సారీ చెప్పింది, కానీ అరెస్ట్ తప్పదు
వివాదం వచ్చిన మరుసటి రోజు, మే 15న శర్మిష్ఠ పలోని తన X ఖాతాలో, “నా భావనలు వ్యక్తిగతం. ఎవరినైనా బాధించాలనే ఉద్దేశం లేదు. ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి” అంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ, ఈ వివాదం చల్లారలేదు. మే 31న కోలకతా పోలీసులు ఆమెను గుర్గావ్‌లోని నివాసంలో అరెస్ట్ చేశారు.
కోర్ట్ – పోలీసులు – విమర్శలు
కోలకతా పోలీసులు ఇచ్చిన ప్రకటన ప్రకారం, ఆమెను పలుమార్లు నోటీసు ఇవ్వాలని ప్రయత్నించగా, ఎప్పుడూ అందుబాటులో లేరని తెలిపారు. దాంతో కోర్టు వారెంట్ తీసుకుని ఆమెను అరెస్ట్ చేశారని వివరించారు. మే 31న అలీపూర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి, జూన్ 13 వరకు న్యాయ హిరాసతలో ఉంచారు.
విద్యార్థిని అయినా బాధ్యత ఉండాలి !
అలీపూర్ కోర్ట్‌లో ప్రభుత్వ న్యాయవాది సౌరిన్ ఘోషాల్ మాట్లాడుతూ, “ఆమె ఒక న్యాయ విద్యార్థిని. అయినప్పటికీ తన చర్యల వల్ల వచ్చే పరిణామాలు తెలుసుకోలేకపోయారు. అనేక పోలీస్ స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు ఉన్నందున విచారణ అవసరం” అని పేర్కొన్నారు.
సింబయోసిస్ నుండి కఠిన చర్యలు
సింబయోసిస్ యూనివర్శిటీ ప్రో చాన్స్‌లర్ విద్యా యెరవడేకర్ మాట్లాడుతూ, “మేము ఆమె భాషను చూసిన తర్వాత, యూనివర్శిటీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తగిన చర్య తీసుకున్నాం. ఆమెను మూడు నెలలపాటు అన్ని అకడెమిక్, నాన్-అకడెమిక్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేశాం. ప్లేస్‌మెంట్స్‌కు అర్హత రద్దు చేశాం. మేము ‘వసుధైవ కుటుంబకం’ అనే భావనను బోధిస్తాం. ఇలాంటి వ్యవహారాన్ని మేం సహించం” అన్నారు.
సామాజిక మీడియా స్వేచ్ఛ vs చట్టం
ఈ ఘటన సోషల్ మీడియాలో వ్యక్తిత్వ స్వేచ్ఛపై, అది ఎంతవరకు పరిమితమవాలో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవైపు భావప్రకటన స్వేచ్ఛకు మద్దతు, మరోవైపు మతపరమైన సామరస్యాన్ని కాపాడే బాధ్యత.. ఈ రెండింటి మధ్య సమతౌల్యం అవసరమనే సందేశాన్ని ఈ సంఘటన అందిస్తుంది.
Kolkata, West Bengal: Kolkata Police arrested a law student Sharmistha Panoli from Pune in Gurgaon for allegedly hurting religious sentiments through social media posts on Operation Sindoor. She was brought to Kolkata on transit remand and produced before the Alipore CJM Court.… pic.twitter.com/jxDpcVSzlJ
— IANS (@ians_india) May 31, 2025