• పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెంపు
• రికార్డు స్థాయికి పెరిగిన ధరలు..
• ఐదు రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన చమురు
దర్వాజ-న్యూఢిల్లీ
Petrol, diesel prices: దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెరుగుతూ వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. వరుసగా రెండో రోజుసైతం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో దేశంలో రికార్డు స్థాయికి ధరలు చేరుకున్నాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, లీటరు డీజిల్‌పై 25 పైసలను చమురు సంస్థలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలో చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజాపెంపుతో లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.102.14కు పెరిగింది. లీటరు డీజిల్ ధర రూ.90.47కు చేరింది. అదే ముంబయలో లీటరు పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.108.19 చేరగా, డీజిల్ ధర రూ.98.16కు పెరిగింది.
ఢిల్లీ, ముంబయిలలో చివరిసారిగా జులైలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. ఆ సమయంలో ఢిల్లీ, ముంబయి నగరాల్లో వరుసగా పెట్రోల్ ధర రూ.101.84, రూ.107.83కు చేరుకున్నాయి. ఇక ఈ వారంలో పెట్రోల్ ధరలు పెరగడం నాల్గో సారి కాగా, చాలా రాష్ట్రాలు పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి. గత ఎనిమిది రోజుల్లో ఏడు సార్లు డీజిల్ ధరలు పెరిగాయి. అయితే, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల డీజిల్ ధరలు సెంచరీ కొట్టాయి.
ప్రస్తుతం చెన్నైలో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.99.80, రూ.95.02గా ఉన్నాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.102.77, డీజిల్ ధర రూ.93.27గా కొనసాగుతోంది. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.105.69, హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.106.26 గా ఉంది. ఈ రెండు నగరాల్లో లీటర్ డీజిల్ ధరలు వరుసగా రూ.96.02, రూ.98.38గా ఉన్నాయి.
కాగా, అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్‌కు రూ.5,630 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక భారత్ తన చమురు అవసరాలను తీర్చుకోవడానికి దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుదల జాతీయ ఇంధన రేట్లను ప్రభావితం చేస్తున్నదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలావుండగా, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సైతం చమురు కంపెనీలు పెంచాయి. తాజాగా 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.43ను పెంచారు. ఢల్లీలో వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.1,793కు చేరింది.
లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక కారణాలు..
యూపీలో మరో దారుణం.. బాలికపై లైంగిక దాడి.. హత్య !
నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్
అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
కుండపోత వర్షం.. నీటమునిగిన హైదరాబాద్
పెగాసస్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మమత ఫైర్