• లీటరు పెట్రోల్ ధర రూ.120కు పైనే..
• అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. దాదాపు 254 శాతం పన్నుపోటుతో ధరలు పైపైకి..
దర్వాజ-న్యూఢల్లీ
fuel prices rose: దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యం పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు గురువారం సైతం మళ్లీ పెరిగి.. వినియోగదారులపై మరింత భారం మోపాయి. తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై చమురు కంపెనీలు 35పైసల చొప్పున పెంచాయి. దీంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో లీటరు పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో రూ.120కు చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తాజా పెంపుతో లీటరు పెట్రోల్ ధర రూ.114.14, లీటరు డీజిల్ ధరలు రూ.105.12గా చేరింది. దేశరాజధాని ఢీల్లీలోనూ చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.108.29, డీజిల్ ధర రూ.97.02కు పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాలైన కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.108.78, రూ.100.14కు పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.105.13, డీజిల్ ధర రూ.101.25కు చేరింది. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.112.06, డీజిల్ రూ.102.98కు పెరిగింది. తెగులు రాష్ట్రాల్లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.112 దాటగా, గుంటూరులో లీటరు పెట్రోల్ రూ.114కు పెరిగింది. ఒక్క అక్టోబర్ నెలలోనే ఇప్పటివరకు 20 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
పన్ను బాదుడు మాములుగా లేదు !
చమురు ధరలు పెరుగుదల ప్రభావం ఇతర నిత్యావసరాల ధరలపైనా పడుతుండటంతో వాహనదారులతో పాటు సామాన్య ప్రజానీకం సైతం లబోదిబో మంటున్నారు. చమురు ధరలు, వాటిపై విధిస్తున్న పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 2014లో అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 109 డాలర్లు కాగా, లీటరు పెట్రోల్ ధర మన దేశంలో రూ.72, లీటరు డీజిల్ ధరలు రూ.57గా ఉన్నాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 85 డాలర్లకు తగ్గిపోయింది. అయితే, ఈ మేరకు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాల్సిందిపోయి.. రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
ఇలా చమురు ధరలు పెరగడానికి ప్రధాన కారణం చమురు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే. దాదాపు 254 శాతం పన్నులు విధిస్తూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయి. గత రెండేండ్లలో దేశీయంగా పెట్రోల్ ధరలు 32 శాతం, డీజిల్ ధరలు 46 శాతం పెరిగాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కంటే ప్రస్తుతం పెట్రోల్ ధరలు 37 శాతం అధికంగా ఉండటం చమురు ధరల పెరుగుదలకు అద్దం పడుతోంది.
పెగాసస్_దేశ ప్రజాస్వామ్యంపై దాడి !
ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరికేనా…?
నేను బీజేపీ ఎంపీని.. ఈడీ నా జోలికి రాదు
Ind Vs Pak : భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్
టాస్ కాయిన్‌తో పాక్ ఎకానమీని పెంచుకుంటారట.. ప్రముఖ వ్యాపారవేత్త సెటైర్లు
T20 World Cup: విండీస్‌పై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాలో గెలుపు
T20 World Cup: విండీస్ చెత్త రికార్డు..
T20 World Cup: ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా బోణీ..