దర్వాజ-ముంబయి
Gadchiroli encounter : మహారాష్ట్రలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ లో నగులురు సోలీసులు సైతం గాయపడ్డారు. ప్రస్తుతం వారిని నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ వెల్లడించారు. ఇప్పటివరకు తాము 26 మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తంగా ఎంతమంది మావోయిస్టులు చనిపోయారనేది ఆదివారం ఉదయం నాటికి పూర్తి వివరాలు అందిస్తామన్నారు.
కాగా, శనివారం ఉదయం గ్యారపట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసు బలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఎన్ కౌంటర్ గడ్చిరోలీ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైనదని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 500 మందికి పైగా భద్రతా బలగాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాలుపంచుకోగా, అందులో గడ్చిరోలీ పోలీసులు 100, ఎలైట్ సీ60 కమాండోలు, సెంట్రల్ బలగాలు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలిలో కూంబింగ్ కొనసాగుతోందని అధికారులు తెలపారు.
Madras High Cour: ప్రజా ప్రయోజనం కోసమా? మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా?
Terrorist Attack : మణిపూర్‌లో భద్రతా కాన్వాయ్ పై ఉగ్రదాడి
Night Time Eating: అర్థరాత్రి తినే అలవాటు మీకుందా? అయితే ఈ ఫుడ్ మాత్రమే తీసుకోండి..
Crime: ఎంతటి అమానుషం.. సంతానం కోసం 16 నెలలుగా యువతిని బంధించి..
Air Pollution: కాలుష్యం.. ప్రపంచంలోనే టాప్‌లో ఢిల్లీ
Tulsi Gowda: అడవి తల్లి బిడ్డకు దక్కిన ‘పద్మం’.. ఆమె కథేంటీ?
పిల్లల్ని కనడంపై ఉపాసన సమాధానం ఇదే..
Kangana Ranaut: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్య్రం’ : కంగనా రనౌత్