• జీహెచ్ఐ నివేదికపై కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం..
• ప్రపంచ ఆకలి సూచిలో దిగజారిన భారత్ ర్యాంకు
దర్వాజ-న్యూఢిల్లీ
Global Hunger Index : ఇటీవల వివిధ దేశాలకు సంబంధించిన ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్‌ఐ) ర్యాంకింగ్స్‌ను జర్మనీకి చెందిన ‘వెల్త్‌హంగర్‌హైఫ్'(డబ్ల్యూహెచ్‌హెచ్) విడుదల చేసింది. ఇందులోని 116 దేశాల జాబితాలో భారత్‌కు 101 స్థానం దక్కింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జీహెచ్‌ఐ రూపకల్పనలో ఉపయోగించిన ‘మెథడాలజీ’ అశాస్త్రీయంగా ఉందని ఆరోపించింది. నివేదికను రూపొందించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, భారత్ చేసిన ఆరోపణల్ని జీహెచ్‌ఐ ఖండించింది. జీహెచ్‌ఐ ర్యాంకింగ్‌పై భారత్ చెత్త ఆరోపణలు చేసిందని కొట్టిపారేసింది. దేశంలో ఆకలి సమస్యను భారత్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతోందని పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో.. కేవలం 3.9శాతం మంది అంగన్‌వాడీ పిల్లలు మాత్రమే పోషకాహార లోపంతో గున్నట్టు గుర్తించామని పేర్కొంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన రియల్ టైమ్ డేటా వివరాల (పోషణ్ ట్రాకర్) ప్రకారం 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు వారు 7.79 కోట్ల మంది ఉన్నారు. ఇందులో పోషకాహార లోపంతో ఉన్న పిల్లల సంఖ్య 30.27 లక్షలు.. అంటే ఇది 3.9 శాతం మాత్రమే అని పేర్కొంది. ఇక జీహెచ్‌హై నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుని వివిధ దేశాలకు ఆకలి సూచి ర్యాంకులను కేటాయించింది. వాటిలో పోషకాహారలోపం, వృధా, కుంగిపోవడం, ఐదేండ్ల లోపు మరణాలు ఉన్నాయి. వీటిలో పోషకాహార లోపం కారణంగా మాత్రమే భారత్ పనితీరు క్షీణిస్తున్నదని పేర్కొంది.
కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల టార్గెట్..
వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి చేసిన ఎయిమ్స్ డాక్టర్
కేరళను ముంచెత్తిన వరదలు.. 10 మంది మృతి
అంబరాన్నంటిన ‘బతుకమ్మ’ సంబురాలు