Loading Now
Global Warming and Climate Change

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రం..

• ఆ ఏడేండ్లు అత్యంత వేడి సంవత్సరాలుగా రికార్డు
• 63 కోట్ల మంది నిరాశ్రయులయ్యే అవకాశం
• ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ప్రపంచ వాతావరణ సంస్థ ఆందోళ‌న

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం

Global Warming and Climate Change: అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం కొనసాగుతుండటం భూ వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతూ.. జీవజాతుల మనుగడపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కాప్‌-26 సదస్సు నేపథ్యంలో డబ్ల్యూఎంవో తన తాజా నివేదికను విడుదల చేసింది.

డ‌బ్ల్యూఎంవో తాజా నివేదిక‌లోని వివ‌రాల ప్ర‌కారం.. ప్ర‌స్తుత వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయి. మ‌రింత దిగ‌జార‌కుండా త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రముంది. లానినా ప్రభావం కార‌ణంగా ఈ ఏడాది ఆరంభంలో ఉష్ణోగ్రతలు తక్కువ‌గా న‌మోదైన‌ప్ప‌టికీ… అలాంటి ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌ర‌మైన‌వేన‌ని నివేదిక పేర్కొంది. ఎందుకంటే పారిశ్రామిక యుగం ముందునాటితో పోలిస్తే 2021లో సగటు ఉష్ణోగ్రత 1.09 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా ఉండ‌ట‌మేన‌ని వివ‌రించింది.

అలాగే, 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021.. అత్యంత వేడి సంవత్సరాలుగా రికార్డుల్లోకి ఎక్కే అవకాశముందని పేర్కొంది. ఏడాది ముగిసేసరికి 2021 అత్యంత వేడి సంవత్సరాల జాబితాలో 5-7 స్థానాల మధ్య ఉండే అవకాశముంద‌ని తెలిపింది. మున్ముందు కూడా ప్ర‌స్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలోనే సముద్ర మట్టాల స్థాయి 2 మీటర్ల మేర పెరిగే అవ‌కాశాలున్నాయి. అదే గ‌న‌క జ‌రిగితే దాదాపు 63 కోట్ల మందికి పైగా ప్ర‌జ‌లు నిరాశ్ర‌యులు అవుతారు. స‌ముద్ర స‌రిహ‌ద్దు ప్రాంతాలు చాలా వ‌ర‌కు నీట మునుగుతాయి. అనేక అరుదైన‌ జీవజాతులు అంతరించిపోవడంతో పాటు, మాన‌వ మ‌నుగ‌డ‌పైనా ప్రభావం పడుతుందని డ‌బ్ల్యూఎంవో ఆందోళన వ్యక్తం చేసింది.

Petrol Price: ఆగ‌ని పెట్రోవాత

COVID-19: కరోనా మరణాలు @ 50 లక్షలు

హ‌స‌రంగా హ్యాట్రిక్‌.. గెలుపు సౌతాఫ్రికాది !

నెల‌రోజుల‌కు పైగా ఉగ్ర‌రూపంలో లావా వెద‌జ‌ల్లుతున్న అగ్నిప‌ర్వ‌తం

Aryan Khan Drugs Case_ఆర్య‌న్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు

భ‌గ్గుమంటున్న చ‌మురు ధ‌రలు

పెగాస‌స్‌_దేశ ప్రజాస్వామ్యంపై దాడి !

ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరికేనా…?

Share this content:

You May Have Missed