దర్వాజ-న్యూఢిల్లీ
- దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- యూరఫ్ మీడియా గ్రూప్ ది ఎకానమిస్ట్ నివేదిక
మానవ చర్యలతో ప్రకృతి విధ్వంసం కారణంగా భూ వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మైనస్ స్థాయికి చేరుకుంటున్నాయి. భారత్‌లోనూ గత కొన్ని సంవత్సరాలుగా ఎండలు మండిపోతున్నాయి. ఇక దేశరాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. 90 ఏండ్ల రికార్డును సైతం చెరిపేశాయి. ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతల మార్పులకు సంబంధించి యూరప్ మీడియా గ్రూప్ ఎకనామిస్ట్ నివేదిక ఆందోళనకర విషయాలను వెల్లడిరచింది.
2041 నాటికి భారత్‌లో ఉష్ణోగ్రతలు ప్రాణాంతక స్థాయికి చేరుకుంటాయని హెచ్చరించింది. అప్పటికీ ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు (49.3 డిగ్రీల సెల్సియస్) చేరుకుంటుందని పేర్కొంది. దక్షిణ భారతంలోనూ 2041 నాటికి ఏండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఎండల మండిపోనున్నాయని నివేదిక పేర్కొంది. దీని కారణంగా అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య క్రమంగా పెరిగి.. ఆస్పత్రులు నిండిపోనున్నాయని తెలిపింది.
గత 26 సంవత్సరాలుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు స్థిరంగా పెరుగుతున్నాయి. ఎండలు తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం అధికమవుతున్నదని వెల్లడిరచింది. యూరప్ మీడియా గ్రూప్ ది ఎకానమిస్ట్ ప్రతియేటా భూమి వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత సంబంధిత మార్పుల అంచనాలు రూపొందించి వెల్లడిస్తుంటుంది. భూమిపై ఉష్ణోగ్రతలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని ఈ నివేదిక నొక్కి చెప్పింది.
టీకా అసమానతలు మానవాళికి ముప్పు
డీఆర్‌డీవో ‘అగ్నిప్రైమ్’ క్షిపణీ
డెల్టా వేరియంట్‌తో తీవ్ర ముప్పు !
వైరస్ కాదు.. ఆక్సిజన్ చంపుతోంది !
Share this content: