Loading Now
Heavy Rain In Chennai

త‌మిళ‌నాడులో దంచి కొడుతున్న వాన‌లు

• నీట మునిగిన చెన్నై
• ముంపు ప్రాంతాల్లో సీఎం ప‌ర్య‌ట‌న.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

ద‌ర్వాజ‌-చెన్నై
Heavy Rain In Chennai: తమిళనాడును భార్షీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా శ‌నివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా చెన్నై, దాని చుట్టు పక్కల ప్రాంతాల‌న్ని నీట మునిగాయి. ప‌లు చోట్ల చెట్లు నేల కూలాయి. వాహ‌నాలు వ‌ర‌ద‌లో కొట్టుకుపోయాయి. రాష్ట్ర రాజ‌ధాని కాల‌నీల‌న్ని నీటమునిగాయి. ముఖ్యంగా కొరటూర్‌, పెరంబూర్‌, అన్నా సలై, టీ నగర్‌, గిండి, అడ్యార్‌, పెరుంగుడి ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకోవ‌డంతో రాక‌పోక‌లు సైతం నిలిచిపోయియి.

చెన్నైతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, కాంచిపురం, ముధురైలోనూ భారీ వ‌ర్షాల కార‌ణంగా ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించిపోయింది. భారీ వర్షాలకు చంబారపాకం, పుయల్‌ రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ఏ క్షణమైన డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఇలావుండ‌గా, రానున్న 24 గంటల్లో రాష్ట్ర రాజ‌ధాని స‌హా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని భార‌త వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. సీఎం స్టాలిన్ ఇప్ప‌టికే అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. స్వ‌యంగా స్టాలిన్ ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు.

కండ్లు పీకేస్తాం.. చెయ్యి నరికేస్తాం.. : బీజేపీ ఎంపీ

స్నానం ఏ సమయంలో చేస్తే మంచిది?

దుమ్ములేపుతున్న ‘లాలా భీమ్లా నాయ‌క్’ ప‌వ‌ర్ ఫుల్ సాంగ్ !

Sierra Leone: ఘోర ప్ర‌మాదం.. 92 మంది మృతి

Fire Accident: క‌రోనా ఆస్ప‌త్రిలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

Climate Change: ప్ర‌కృతి విధ్వంసం.. ప్ర‌కోపం..

Share this content:

You May Have Missed