Breaking
Tue. Nov 18th, 2025

హిమాచల్‌లో విరిగి కొండచరియలు

Himachal Pradesh Landslide
Himachal Pradesh Landslide

◘ 11 మృత దేహాలు లభ్యం.. 14 మందికి తీవ్ర గాయాలు
◘ మరో 40 మంది శిథిళాల కిందే.. కొనసాగుతున్న సహాయక చర్యలు

దర్వాజ-సిమ్లా
Himachal Pradesh Landslide: హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ దుర్ఘటన కారణంగా చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది. తీవ్రంగా గాయపడిన మరో 14 మంది సహాయ బృందాలు రక్షించాయి. ఇంకా శిథిళాల కింద 40 మంది వరకు వుండవచ్చుననీ, వారి కోసం గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడిరచారు.

కిన్నౌర్‌ జిల్లా రెకాంగ్‌ పియో-సిమ్లా హైవేపై బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తున్న హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణా శాఖకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్న‌ట్టు సమాచారం. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 200 మందికి పైగా జవాన్లు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.

Related Post