Loading Now
History of Rachakonda Fort _Telangana Heritage Spot

రాచకొండ రాజసం

శ్రమజీవుల చేతి మునివేళ్లతో..
జాలువారిన కళారూపాలు , కట్టడాలు
 శిలలపై చెక్కిన శిల్పాలు … 
రాజదర్బార్లు .. ఆలయాలు రాచకొండ సొంతం

ఆ శిథిలాలు చరిత్రకు సాక్షాలు . అంతరించి పోతున్న అలనాటి కళాకృతులకు నిలువెత్తు నిదర్శ ణాలు . పచ్చని కార్పెట్ పరిచినట్లు ఆ ప్రాంతం .. పర్యాటకులకు కనువిందు పంచే కమనీయ స్వప్నం . అల్లంత దూరాన కొండలు , గుట్టలతో కన్పించే ఆ ప్రాంతంలో ఏముందీ … ? రాళ్లు రప్పలు తప్ప ! అని అటువైపు వెళ్లే వారు అడుగిడితే .. ! పగలూ .. రాత్రి , ఆకలి , దప్పిక గుర్తుకు రాదు . ఆనాటి శ్రమజీవుల చేతి మునివేళ్ల ద్వారా రూపుదిద్దుకున్న కళారూపాలు, కట్టడాలు, శిలలపై చెక్కిన శిల్పాలు .. రాజదర్బా లు .. ఆలయాలు .. ఒకటేమిటీ శతృదుర్బేధ్యమే కాదు , చీమ కూడా ఇసుమంతైనా అడుగిడేందుకు అవకాశం లేని ప్రాంతమది.

రాళ్లపై చెక్కిన చూడచక్కని ముఖ ద్వారాలూ , గోపురాలు. ఆ చెంతనే రక్షక బటులకు విశ్రాంతి నిచ్చే గుడారాలు. ఒకటేమిటీ ఇలా చూడ ముచ్చటగా ఉన్న ఆ ప్రాంతం ఒకనాడు  సూర్యక్రాంతి మెరుపులతో ఒలలాడిందన్నది చరిత్ర సత్యం. కానీ నేడూ ఆలానా, పాలనా లేక, కళావిహీ నంగా మారుతోంది. గత వైభవ చిహ్నాలు , అలనాటి రాజులు , బటుల ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తి ప్రేరణలు. అందుకు ఆధునిక యుగంలో అవి అద్భుతాలు, నాడు మిన్నంటిన నక్షత్రాల వెలుగులు పంచిన ఆ ప్రాంతం నేడు శిథిలావస్థకు చేరుకుంది.

History-of-Rachakonda-Fort-_Telangana-Heritage-Spot-3 రాచకొండ రాజసం

అసాంఘిక శక్తుల చీకటి సామ్రాజ్యానికి నిలయంగా మారింది. వీటికి బ్రేకుల పడాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాల్సిన అవసరముంది . తెలం గాణలో పేరుగాంచిన ప్రాంతంగా విరాజిల్లాల్సిన అవసరముంది. ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని చిత్రనగరిగా చేస్తామని వాగ్దానం చేశారు. 3 సంవత్సరాల క్రితం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం విదితమే . అనేక సందర్భాల్లో ప్రకటనలు చేస్తున్నారు . ఈ నేపథ్యంలో మన ‘ చిత్రనగరి ‘ ని ఒక్క సారి చూసొద్దామా . ! 

History-of-Rachakonda-Fort-_Telangana-Heritage-Spot-11 రాచకొండ రాజసం
ఉత్తర తెలంగాణకు రాజధానిగా రాచకొండ 

క్రీ.శ 1326 -1476 వరకు రాచకొండను ఉత్తర తెలంగాణ ప్రాంత రాజధానిగా చేసుకుని 150 ఏళ్లు పాలించారని చరిత్ర కారులు చెబుతున్నారు . అంతకు ముందు కాకతీయుల కాలంలో తెలంగా ణ ప్రాంతానికి వరంగల్ రాజధానిగా పనిచేసింది . అనంతర కాలంలో రాచకొండ పనిచేసింది. నాడు తెలంగాణలో గోల్కొండ , భువనగిరికోట, దేవరకొండ , రాచకొండ పట్టణాలు రాజులకు పెట్టని కోటలుగా మారాయి. అందులో గోల్కొండ మినహా రాచకొండ వంటి చారిత్రక ప్రాంతాలను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇటు రంగారెడ్డి అటు నల్గొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ రెవెన్యూ పరిధిలో మొత్తం 32 వేల ఎకరాలు కలిగి ఉంది.

History-of-Rachakonda-Fort-_Telangana-Heritage-Spot-112 రాచకొండ రాజసం

రాచకొండ కట్టడాలు సుమారు 6 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించాయి. దీని చుట్టూ మంచాల , ఇబ్రహీంపట్నం , నారాయణపూర్ , మర్రిగూడ , చౌటుప్పల్ , చండూర్ మండలాలున్నాయి. కాయతీయుల యుగం ముగిసిన తరువాత వారి సైన్యాధ్యక్షులైన రేచర్ల పద్మనాయక రాజులు 150 ఏళ్ల సుదీర్ఘకాలం పాలించారు. వీరి పాలనలో ప్రధానంగా సింగ మనాయుడు, మాదనాయుడు పాలించారు. వారి పాలనతోనే రాచకొండ రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది. కోటలతో పాటు వందల దేవాలయాలు,  నీటి వనరులు, కాలువలు తవ్వించి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశారు. అందులో భాగంగానే మాదనాయకుడు నాగసముద్రం అనే కాలువను తవ్విం చినట్లు తెలుస్తుంది.


శత్రు దుర్భేధ్య కోటగోడలు…
History-of-Rachakonda-Fort-_Telangana-Heritage-Spot-2 రాచకొండ రాజసం


రికార్డుల ప్రకారం సుమారు 6 వేల ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించిన రాచకొండ గడికోటలు శత్రుదుర్బేధ్యానికి తావు లేకుండా నిర్మించారు. 9000 ఏళ్ల కిందట సంగదమనాయకుల పాలనలో ఎంతో కళాకృతులతో కూడిన కోటలు నిర్మించారు. కనీసం కనుచూపుమేర కూడా గడిలోనికి పడకుండా నిర్మించారు. ఒకవేళ గడిలోనికి వచ్చిన శత్రువు మళ్లీ బయటకుపోవాలంటే ఆసాధ్యం. ఎటూ రక్షక బటుల ఆధీనంలోనే పాలన సాగింది.

రాజదర్బార్, విశ్రాంతి, రాజమందిరాల గదికి చేరుకోవాలంటే కనీసం 100కు పైగా రక్షకభటుల కోటలను కూల్చిన తరువాతనే చేరుకోవాల్సి ఉంటుంది. నలుదిక్కుల నుంచి దాడి చేయడానికి వస్తున్న శత్రువును ఎంత అర్ధరాత్రైనా పసిగట్టడానికి అనువుగా ఉన్న ప్రాంతం రాచకొండ. ఎత్తైన కొండలు, ఎంతో చూడచక్కని కట్టడాలు, కళాకృతులతో నిండి ఉన్న ఆ ప్రాంతం పర్యాటకులకు నేటికీ ఆహ్లాదాన్నిస్తోంది. నేటికీ ఆ కోటగోడలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. 

శివభక్తుల నిలయం .. 
History-of-Rachakonda-Fort-_Telangana-Heritage-Spot-12 రాచకొండ రాజసం


రేచర్ల పద్మనాయక రాజుల పాలనతో రాచకొండ శివభక్తులతో నిండి ఉంది. అందుకు సాక్షం కోట నలుదిక్కుల పర్యటిస్తున్న సందర్భంగా వందల శివాలయాలు, రామాలయాలు, గణపతి శిల్పాలు, అంతేకాదు పాలరాతితో చెక్కిన శిల్పాలు దర్శనమిస్తాయి. నేడు యంత్రాలు చేసే పనులు నాడు మనషులు చేశారంటే నమ్మశక్యం కాని కళాకండాలవి. శివాలయం చుట్టూ పాలరాతి మాదిరిగా చెక్కిన నునుపు బండల అమరిక, వివిధ రూపాల్లో చెక్కిన పనితనం అక్కడ కన్పిస్తుంది. కానీ నేడు అనేక శివాలయాలు గుప్తనిధుల తవ్వకాలతో ఆనవాళ్లు కోల్పోతోంది. 


తెలంగాణలో మేటి పర్యాటక కేంద్రం…


 రాచకొండపై పురావస్తు, పర్యాటకశాఖ దృష్టి సారించి అభివృద్ధి చేస్తే రాజధానికి సమీపంలో మేటి పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఇటు నాగార్జునసాగర్ , అటు విజయవాడ , శ్రీశైలం హైవేలకు కేవలం 20 కిలో మీటర్ల దూరంలోనే రాచకొండ ప్రాంతముంది. రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా హెలిక్యాప్టర్ పై కేవలం 11 నిమిషాల్లోనే చేరుకుంటారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశే ఖరరావే తన ఏరియల్ సర్వే సందర్భంగా ప్రకటించారు. చుట్టూ కొండలు, గుట్టల మధ్య పచ్చని వాతావరణంతో నిండి ఉంది.

History-of-Rachakonda-Fort-_Telangana-Heritage-Spot-5 రాచకొండ రాజసం

వాయు, శబ్ద, పర్యావరణ కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కోట వరకు తారు రోడ్డు ఉంది. ఎంత కరువు సంభవించినా నీటికి కొదువుండదు. చరిత్రలో భద్రపర్చే కట్టడాలు, ఆలయాలు, శిల్పాలు, కళాకృతులకు నిలయం. పద్మనాయకులు ఎంతో ముందుచూపుతో నిర్మించిన కట్టడాలు, కోటలు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. నాడు రాజులు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను కోటలు, గుడుల, గోపురాల కింద దాచి ఉంటారన్న నానుడితో గుప్తనిధుల తవ్వకాలు విచ్చలవిడిగా జరుపుతున్నారు. దాంతో కోటలోని ఆలయాలు, కోటలు తవ్వకాలతో తన సహజ స్వరూపాన్ని కోల్పోతున్నాయి. ఆ కళావైభాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

FB_IMG_1616220427114-edited రాచకొండ రాజసం

స్పెషల్ స్టోరీ:

జోగు శ్రీనివాస్,

రిపోర్టర్, రంగారెడ్డి

Share this content:

You May Have Missed