Loading Now
Holi celebrations india_Happy Holi 2021 Wishes, images, messages, greetings, Whatsapp, Instagram, Facebook

సప్తవర్ణాల కేళీ.. ఆనంద హోలీ !

వసంతంలో వచ్చే తొలి వేడుక
సప్తవర్ణాల కలయిక
రవికిరణ తుషారకణాల మేలుకలయి
మోదుగుపూల హోలీ ఆనంద‌ కేళీ.. మన హోలీ !

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్
ముందుగా ద‌ర్వాజ‌.కామ్ రీడ‌ర్స్ కి ఆనంద హోలీ.. రంగులు కేళీ.. హోలీ శుభాకాంక్ష‌లు !

ఆనంద కేళీ.. హోెలీ !

Holi-celebrations-india_Happy-Holi-2021-Wishes-images-messages-greetings-Whatsapp-Instagram-Facebook-2 సప్తవర్ణాల కేళీ.. ఆనంద హోలీ !

హోలీ ఈ పేరు విన‌గానే మ‌నంద‌రికి గుర్తొచ్చేది ప్ర‌కృతి ప్ర‌సాదించిన స‌ప్త‌వ‌ర్ణాలు. చిన్న పెద్ద‌, ధ‌నిక పేద అనే తేడా లేకుండా ఎంతో ఆనంద దేశంలో జ‌రుపుకునే పండ‌గ‌ల్లో హోలీ ఒక‌టి. ఒక‌రిపై ఒక‌రు రంగులు జ‌ల్లుకుంటూ త‌మ ప్రేమ‌ను, ఆనందాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. ఈ హోలీ సంబరాలు దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జ‌రుపుకుంటారు. మొత్తంగా చూస్తే కనువిందు చేసే కలర్ ఫుల్ రంగులు.. ప్ర‌జ‌ల మ‌ధ్య రంగులు హ‌రివిల్లులు.. ప్రేమానురాగాలు.. స‌ప్త వ‌ర్ణాల వ‌ర్షం కురిపిస్తుందని చెప్పాలి.

పెద్ద చ‌రిత్రే ఉంది !

హోలీ పండగ‌కు పెద్ద చ‌రిత్రే ఉంది. దీనిని ద్వాపర యుగంలోనే ఈ పండుగ జరుపుకున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ప్ర‌తియేటా ఫాల్గుణ మాసంలో వ‌చ్చే పౌర్ణ‌మి రోజున జ‌రుపురే ఈ రంగుల పండుగ‌ను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. కృష్ణుడు రాధపై రంగునీళ్లు చల్లడం, బదులుగా రాధ శ్రీకృష్ణుడిపై వసంతం కురిపించడం నుంచి ప్రేమికులు, స్నేహితులు, బంధువులు ఒకరిపై మరోకరు రంగులు చల్లుకుంటారు. ఇది హోలీకి నాంది అని ఓ కథనం ప్రచారంలో ఉంది. అలాగే

Holi-celebrations-india_Happy-Holi-2021-Wishes-images-messages-greetings-Whatsapp-Instagram-Facebook-01 సప్తవర్ణాల కేళీ.. ఆనంద హోలీ !

హోలీకి సంబంధించి మ‌రో పురాణ‌గాథ కూడా ప్రచారంలో ఉంది. హోలీ పండుగ ముందు రోజు కాముని దహనం చేస్తారు. రాక్షసరాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరతాడు.

Holi-celebrations-india_Happy-Holi-2021-Wishes-images-messages-greetings-Whatsapp-Instagram-Facebook-8 సప్తవర్ణాల కేళీ.. ఆనంద హోలీ !

దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే, విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా, హోలిక మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. దీనికి గుర్తుగానే హోలీకి ముందు రోజు కాముని దహనం పేరుతో చలి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తుంది.

ప‌ల్లె ప్ర‌త్యేక‌మే !

Holi-celebrations-india_Happy-Holi-2021-Wishes-images-messages-greetings-Whatsapp-Instagram-Facebook3 సప్తవర్ణాల కేళీ.. ఆనంద హోలీ !

తెలుగునాట ప‌ల్లెల్లో ఇప్ప‌టికీ హోలీ పండ‌గ ప్ర‌త్యేక‌మే. అక్క‌డ హోలీ ప‌దిరోజుల ముందే ప్రారంభం అవుతుంది. ప‌ల్లెనాట హోలీ అంటే అంద‌రికీ గుర్తొచ్చేది కాముని పున్న‌మి. అలాగే పిల్ల‌ల కోలాటాలు, ఆట‌పాట‌లు. ప‌ల్లెటూర్ల‌లో పిల్ల‌లు, పెద్ద‌లు హోలీ హోలీల రంగ‌హోలీ చెమ్మ‌కేళీల హోలీ అంటూ పాట‌లు పాడుతూ.. ఇటింటికి తిరిగి ధాన్యం, డ‌బ్బులు సేక‌రిస్తారు. సాయంత్రం వేళ కోలాటాల ఆటపాట‌ల‌తో ద‌రువు మోగుతుంది.

ఇలా ప‌దిరోజుల అంగ‌రంగ వైభ‌వంగా మ‌స్తు మ‌జా అనిపించేలా ప‌ల్లెల్లో హోలీ పండుగ జ‌రుగుతుంది. హోలీ రోజు మ‌రింత ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. హోలీకి ముందు రోజు అర్థ‌రాత్రి కాముని ద‌హ‌నం (కాముని కాల్చుట‌) కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ఇది ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంటుంది. ఆ త‌ర్వాతి రోజు రంగులు జ‌ల్లుకుంటూ హోలీని జ‌రుపుకుంటారు.

మొదుగుపూల అందం అరుణచందన శోభితం

Holi-celebrations-india_Happy-Holi-2021-Wishes-images-messages-greetings-Whatsapp-Instagram-Facebook-7 సప్తవర్ణాల కేళీ.. ఆనంద హోలీ !

మోదుతుపూలు. వీటిని అగ్నిపూలు అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ పూలు చూడ‌టానిని అగ్నిశిఖ‌ల‌వ‌లే కనిపిస్తాయి. తెలుగునాట క‌నిపించే మోదుతుపూలు.. ఫిబ్ర‌వ‌రి మార్చినెల‌ల్లో అరుణ వ‌ర్ణ‌శోభిత‌మై విస్తారంగా విరబూస్తాయి. శివునికి ఈ పూలు ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌వి. ఈ పూల‌తో చేసిన రంగుల‌ను హోలీ రోజున ఒక‌రిపై ఒక‌రు జ‌ల్లుకుంటారు. ఇప్ప‌టికీ ఈ పూల‌తో రంగులు త‌యారు చేసి.. జ‌ల్లుకోవ‌డం ప‌ల్లెటూర్ల‌లో చూడ‌వ‌చ్చు.

జాగ్ర‌త్తలు అవ‌స‌ర‌మే !

Holi-celebrations-india_Happy-Holi-2021-Wishes-images-messages-greetings-Whatsapp-Instagram-Facebook-6 సప్తవర్ణాల కేళీ.. ఆనంద హోలీ !

హోలీ అంటేనే రంగులు. అయితే, నేడు మార్కెట్‌లో అనేక ర‌కాల కృత్రిమ రంగులు ల‌భిస్తున్నాయి. హోలీ రోజు ఎక్కువ‌గా వీటినే వాడుతున్నారు. అయితే, వీటి ద్వారా చ‌ర్మ సంబంధ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. మ‌రి కొంద‌రికి ఈ కృత్రిమ రంగుల‌తో ఎల‌ర్జీ క‌లిగే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెబుతున్నారు. కాబట్టి హోలీ రోజున స‌హ‌జ సిద్ధ‌మైన రంగులు ఉప‌యోగించ‌డం మేల‌ని సూచిస్తున్నారు.

చివ‌ర‌గా.. మ‌రొక్క‌సారి స‌ప్త‌వ‌ర్ణాల హోలీ.. మీ జీవితంలో మ‌రింత ఆనందం తీస‌కురావాల‌ని కోరుకూంటూ.. హోలీ శుభాకాంక్ష‌లు ! – ద‌ర్వాజ.కామ్

https://darvaaja.com/holi-celebrations-india_happy-holi-2021-wishes-images-messages-greeting-whatsapp-instagram-facebook/

రాచకొండ రాజసం

సైలెంట్ కిల్లర్.. రోజు 40 వేల మంది బలి !

https://darvaaja.com/health-benefits-of-mango-juice_raw-mango-juice-summer_special-drink/

నీటి బొట్టు.. బతుకు మెట్టు !

గెలిచినా భయపడుతున్న సారు ‘కారు’

భారత్ లో ఆనందం ఆవిరి !

https://darvaaja.com/devunipadakal-village-lord-venkateshwara-swamy-jatara/

Share this content:

You May Have Missed