వలస కార్మికులు
పనిముట్టుగా – పలుగువో, పారవో
మట్టి బంధమై
నడుస్తున్నాడు – బుక్కెడు బువ్వ కోసం
ఆకలి యాత్ర
వలస బాట – శ్రమ దేహదారులు
ఆర్తి గీతాలు
జీవన యానం – ఆశల్ని మోసుకెళ్తూ
చిల్లుల నావ
సొంత గూటికి – వలస పక్షులుగా
తిరోగమనం
ఏ గూటి పక్షో – రెక్కలు కొట్టుకుంటూ
బతుకు ఛిద్రం
గమనం – రక్తసిక్త పాదాలతో
అమానవీయం
ఆకలి నాదం – శతాబ్దాల చరిత
అన్నమో…రామ.
శ్రమ సూర్యులు – రాలి పడుతున్నారు
నడి రోడ్డుపై
జన ప్రవాహం – ఎడారి నడకలు
దాహం తీర్చాలి
సేవా రెక్కలు -చేయూత నివ్వాలి
మనిషితనం
మొలకెత్తాలి – బతుకు విత్తనాలు
మానవత్వంలో
తోడు నీడగా – మనషి చెట్టవ్వాలి ప్రాణ వాయువై..

వనిపాకల లచ్చిరెడ్డి, ఉపాధ్యాయుడు
నల్గొండ(టౌన్)
vlr.vanipakala@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
ఓటుకు నోటు తప్పక తీసుకోవాల్సిందే..!
ఏందే అన్నా.. ఎట్లున్నా కష్టమేనా ?