• రెండో స్థానంలో టీఆర్ ఎస్, ఘోర ఓటమిపాలైన కాంగ్రెస్
దర్వాజ-హుజురాబాద్
Huzurabad By Poll : తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి అధిక్యంలో కొనసాగిన ఈటల.. చివరి రౌండ్ లెక్కింపునకు వచ్చే కొద్ది తన అధిక్యాన్ని పెంచుకుంటూ వచ్చారు. మొత్తంగా ఈటల రాజేందర్ 20 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ హుజూరాబాద్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఉప ఎన్నిక ఫలితాల్లో ఘోర ఓటమి పాలైంది.