చెట్టు ప్రగతికి మెట్టు

పిల్లల మర్రి వృక్షం
పిల్లల మర్రి వృక్షం

తాయిలాలు ఇస్తున్నారంటే
మొదటి వరుసలో ఉంటాం
పధకాలు ప్రకటిస్తుంటే
మొదట్లోనే ఆశగా ఉంటాం
రాయితీలు ఇస్తున్నారంటే
ప్రాధాన్యతను కోరుకుంటాం
అక్కువుగా వస్తుందంటే తొందర తొందర చేస్తాం
సబ్సీడి వస్తుందంటే
వరుస కట్టి నిలబడతాం

ఇన్ని ప్రయాసలు పడేవాళ్ళం
సమాజానికి హేతువంటే
ఎందుకో ఆలోచిస్తాం…

సంఘం కోసం ఏది చేయాలన్నా దేనికో వెనకడుగు వేస్తున్నాం…

మనిషి ఎందుకో మరీ ఇంత ‘మనీ’షిగా మారాడు..

ప్రతి రోజు పీల్చుకునే ఆక్సీజన్ ఉచితంగా కావాలి. కాని చెట్లను పెంచడానికి ప్రయత్నం చేయం. అడ్డమైందని వీలైతే గొడ్డలి వేటుతో నరుకడానికి ఉరుకుతాం.

రోజు మనం పీల్చే గాలి కొనాలంటే ఎంత డబ్బు ఖర్చు చేయాలో…

అసలే కాలం కలిసి రావడం లేదు. కరోనా వేటుకు గాలి అందక ప్రాణాలు పోతున్నాయి. పీల్చే గాలి స్వచ్ఛంగా కావాలనుకుంటే
భావి తరాలకు అందించాలంటే ‘మనీ’షి మనిషిగా బాధ్యతగా వ్యవహరించాలి. సమాజం పట్ల సేవా దృక్పథంతో మెలగాలి. అందుకు తొలి మెట్టు మనం నాటే చెట్టు.

కొద్దిపాటి చెట్ల పెంపకం అనే వ్యాపకం అనంతమైన ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

మిత్రులారా మనం సమాజానికి ఇచ్చే బహుమతి
పచ్చని చెట్ల పురోగతి.

చెయ్యి చెయ్యి కలుపుదాం
పచ్చని వనాన్ని పెంచుదాం.

మేలు చేయును సమాజం
ప్రతి ఇంట హరితాహారం.

ashoka-chakravarthy-neelakantam-darvaaja.com_-775x1024 చెట్టు ప్రగతికి మెట్టు

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

Share this content:

Related Post