లింగ‌ స‌మాన‌త్వం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌న‌ట్టే !

India gender inequality extremely high_global gender gap WEF report
  • స్త్రీ-పురుష‌ సమానత్వంలో అట్టడుగులో భారత్
  • లింగ స‌మాన‌త్వం పొంద‌డానికి మ‌రో 136 ఏండ్లు ప‌డుతుంద‌న్న‌ డ‌బ్ల్యూఈఎఫ్‌
  • తొలి స్థానంలో ఐస్ లాండ్‌.. భార‌త్ కంటే మెరుగైన స్థానంలో నమీబియా, రువాండా, లిథువేనియా, బంగ్లా

కాలంతో పోటీప‌డుతూ నేటి స‌మాజం అభివృద్ధిలో దూసుకుపోతోంది. స్త్రీ-పురుష స‌మాన‌త్వంలో ప్ర‌పంచంతో పాటు భార‌త్ సైతం దూసుకుపోతున్న‌ద‌ని ఇదివ‌ర‌కు ప‌లుమార్లు మ‌న నేత‌లు, అధికారులు ప్ర‌స్తావించారు. అయితే, దీనికి విరుద్ధంగా బిజీబిజీగా సాగుతున్న ప్ర‌స్తుత సమాజంలో పురుషుల‌తో స‌మానంగా మ‌హిళ‌ను నిల‌ప‌డంలో నేటి ఆధునిక ప్ర‌పంచం ఇంకా వెనుక‌బ‌డే ఉంది. ఇత‌ర దేశాల‌తో పోలిస్తే లింగ స‌మాన‌త్వంలో భార‌త్ మ‌రింత దారుణ స్థితిలో ఎక్క‌డో అట్ట‌డుగు స్థానంలో అధ్వాన్న స్థితిలో ఉండ‌టం.. దేశంలో స్త్రీ-పురుష అస‌మాన‌త్వానికి అద్దం ప‌డుతోంది.

లింగ స‌మాన‌త్వం పొంద‌డానికి మ‌రో 136 ఏండ్లు !

India-gender-inequality-extremely-high_global-gender-gap-WEF-report-1 లింగ‌ స‌మాన‌త్వం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌న‌ట్టే !

లింగ స‌మాన‌త్వానికి సంబంధించిన గ్లోబల్ ‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ను “వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం” (డ‌బ్ల్యూఈఎఫ్‌) విడుద‌ల చేసింది. ఈ నివేదికలో 156 దేశాలకు చెందిన ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం, విద్యా స్థితి, ఆరోగ్యం-మనుగడ స్థితి, రాజకీయ సాధికారత వంటి అంశాల‌ను పరిగణలోకి తీసుకుని ఆయా దేశాల్లోని లింగ స‌మాన‌త్వాన్ని.. స్థితిగ‌తుల‌ను వివ‌రించింది.ఇదివ‌ర‌కు లింగ‌స‌మాన‌త్వం సాధించ‌డానికి 99.5 సంవత్సరాల సమయం అవసరం కాగా, ఇప్పుడు 135.6 సంవత్స‌రాలు ప‌డుతుంద‌ని ఈ నివేదిక పేర్కొంది.

దీనికి గ‌ల కార‌ణాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌ధానంగా ఉంద‌ని తెలిపింది. స్త్రీ-పురుష స‌మాన‌త్వంలో ఐస్ లాండ్ మొద‌టి స్థానంలో ఉండ‌గా.. పశ్చిమ యూరప్‌లో కొంతమేర‌, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాలో లింగ సమానత్వంలో అంతరం ఎక్కువగా ఉందని ఈ నివేదిక చెబుతోంది. లింగ సమానత్వంలో 89.2 శాతంలో ఐస్ లాండ్ మొదటి స్థానంలో ఉండగా.. ఆ త‌ర్వాత 86.1 శాతంతో రెండో స్థానంలో ఫిన్లాండ్‌, 84.9 శాతంతో మూడో స్థానంలో నార్వే, 84 శాతంతో నాలుగో స్థానంలో న్యూజిలాండ్‌, 82.3 శాతంతో ఐదో స్థానంలో స్వీడన్ దేశాలు ఉన్నాయి.

స్త్రీ-పురుష స‌మాన‌త్వంలో అధ్వాన్నంగా భార‌త్ !

India-gender-inequality-extremely-high_global-gender-gap-WEF-report-2 లింగ‌ స‌మాన‌త్వం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌న‌ట్టే !

డ‌బ్ల్యూఈఎఫ్ నివేదిక ప్ర‌కారం.. 156 దేశాల డేటాతో కూడిన ఈ నివేదిక‌లో లింగ స‌మాన‌త్వంలో ఐస్ లాండ్ మొద‌టి స్థానంలో ఉంది. వ‌రుస‌గా 12 ఏండ్లుగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. భార‌త్ మాత్రం లింగ స‌మాన‌త్వంలో 28 స్థానాలు పడిపోయి 140వ స్థానానికి దిగ‌జారింది. అత్యధిక అసమానత రాజకీయాల్లో ఉంది. రాజకీయాల్లో మహిళల సంఖ్య 22 శాతం మాత్రమే ఉండగా.. ఆరోగ్య రంగంలో సమానత్వం అత్యధికంగా 96 శాతంగా ఉంది.

ఆర్థిక సమానత్వంలో మహిళల సంఖ్య 58 శాతంగా ఉన్నప్పటికీ, వారు పురుషులతో సమానంగా మారడానికి 267.6 సంవత్సరాలు పడుతుందని నివేదిక పేర్కొంది.భార‌త్‌లో కార్మిక శ‌క్తిలో 22 శాతం మంది మ‌హిళ‌లు మాత్ర‌మే చురుగ్గా ఉన్నారు. 29.2 శాతం మహిళలు టెక్నికల్ రోల్స్ లో ఉన్నారు. అలాగే, 14.6 శాతం మంది మ‌హిళ‌లు సీనియ‌ర్ హోదాల్లో ఉన్నారు. అయితే, స‌గటు భారతీయ మహిళ ఆదాయం సగటు భారతీయ పురుషుడిలో 20.7 శాతం కంటే తక్కువగా ఉంది. 2019లో మహిళా మంత్రుల సంఖ్య 23.1 శాతంగా ఉంటే.. 2021 నాటికి అది 9.1 శాతానికి తగ్గిందని డ‌బ్ల్యూఈఎఫ్ నివేదిక వివరించింది.

ద‌క్షిణాసియాలో టాప్‌లో బంగ్లాదేశ్ !

India-gender-inequality-extremely-high_global-gender-gap-WEF-report-6 లింగ‌ స‌మాన‌త్వం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌న‌ట్టే !

సాధార‌ణంగా వెనుకబడిన దేశాలుగా పరిగణించబడే నమీబియా, రువాండా, లిథువేనియా వంటి దేశాలు లింగ స‌మాన‌త్వంలో భార‌త్ కంటే మెరుగైన స్థానంలో ఉండ‌ట‌మే కాకుండా ప్ర‌పంచంలో టాప్ -10 దేశాలలో ఉండటం విశేషం. ఇక ద‌క్షిణాసియాలో బంగ్లాదేశ్ లింగ స‌మాన‌త్వంలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన దేశంగా నిలిచింది. స్త్రీ-పురుష స‌మాన‌త్వాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌ని డ‌బ్ల్యూఈఎఫ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాదియా జాహిదీ అన్నారు. పనిప్రదేశాలతో పాటు ఇంటి వద్ద కూడా లింగ సమానత్వాన్ని కరోనా ఎంతో ప్రభావితం చేసింద‌నీ, ఈ పరిస్థితిలో మార్పు రావ‌డానికి మ‌రికొన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని తెలిపారు.

https://darvaaja.com/devuni-padakal-sri-venkateshwara-swamy-kalyanotsavam/
https://darvaaja.com/world-water-day-2021_india/
https://darvaaja.com/holi-celebrations-india_happy-holi-2021-wishes-images-messages-greetings-whatsapp-instagram-facebook/
https://darvaaja.com/finland-is-the-worlds-happiest-country_india-ranks-139-out-of-149/
https://darvaaja.com/indian-farmers-protest-day-111/

Share this content:

Related Post