దర్వాజ-న్యూఢిల్లీ
భారత్‌లో కరోనా విశ్వరూపం దాల్చింది. రోజురోజుకూ కరోనా మహమ్మారి తన ప్రభావాన్నిపెంచుకుంటుండటంతో దేశంలో పరిస్థితులు భయాందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా దేశంలో ముడున్నర లక్షల మందికి కరోనా సోకడం దేశంలో వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,49,691 మందికి కరోనా సోకింది.
దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 1,69,60,172 కు చేరాయి. మరణాలు సైతం గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,767 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,92,311కు పెరిగింది. కొత్తగా 2,17,113 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 1,40,85,110కి చేరింది. ప్రస్తుతం 26,82,751 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 14,09,16,417 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. అలాగే, మొత్తం 27,79,18,810 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 17,19,588 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
Share this content: