Loading Now
India’s new Covid wave

నరబలిస్తున్న నాయకులు !

  • కరోనా ఉందని తెలిసినా ఎన్నికలు జరిపిండ్రు
  • తప్పంతా జనాలపైనే మోపిండ్రు
  • కట్టడిని కాటికి వదిలేసిండ్రు
  • ఆ రాష్ట్రాల్లో 530 శాతం పెరిగిన కరోనా మహమ్మారి

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

“అవ్ మళ్లా.. పానం పోతే ఏంది? మాకు పదవులు కావాలె..
జనం బతకనీ.. చావనీ.. మాకేంది ?
బతికుండాల్సింది మేము.. మంచిగుండాల్సింది మేము.
జనాలు చస్తే.. ఒక రాజకీయం జేస్తాం.. బతికుంటే మరో రాజకీయం జేస్తాం..
గీడ మేము చెప్పిందే వేదం. మేము రాసిందే శాసనం. కోర్టులు చెప్పినా.. ఆ సృష్టి కర్త వద్దన్నా వినేదే లేదు.”

ఇవే మన రాజకీయ నాయకుల మెదల్లల్లో మెదులుతున్న మాటలై ఉండొచ్చు. లే లే అవే మెదులుతున్నాయ్.. అందుకే జనాల పానాలను లెక్క చేయలేదు. కష్టం అని తెలిసినా.. రాజకీయం చేసిండ్రు. కోర్టులు చెప్పినా ” మీరేంది మాకు చెప్పేది.. మాకు నచ్చింది చేస్తాం.” అనేసిండ్రు. గందుకే కరోనా గింతల వ్యాపించింది. అందుకే జనం పిట్టల్లా.. రాలిపోతుండ్రు. ఎన్నికలు పెట్టి అందరిని ప్రమాదంలోకి నెట్టేసిండ్రు. ఇవి ఎవరో ఒకరు గుడ్డిగా చెప్పిన విషయాలు కావు. ఎన్నో సంస్థలు, స్వయంగా ప్రభుత్వమే తేల్చిన లెక్కలు ఇవి.

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంది. పోలింగ్ జరిగిన పక్షం రోజుల్లో అక్కడ పాజిటివ్ కేసులు, మరణాలు గణనీయంగా పెరిగాయని డేటా చూపిస్తోంది. దీని ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడింది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఆంక్షల నడుమ హోలీ వేడుకలు జరుపుకునేందు ప్రభుత్వాలు ఒకే చెప్పాయి. దీంతో మార్చి 29 నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో క్రియాశీల కేసులు 152 శాతం పెరిగాయి. ఈ 15 రోజుల్లో యాక్టివ్ కేసులు 5,40,720 నుంచి 13,65,704కు చేరాయి. అంటే దేశంలో హోలీ ఓ సూపర్ స్ప్రెడ్డ‌ర్‌గా నిలిచింది. ఎన్నికలైతే దేశంలో కరోనా ప్రభావం పెరగడంలో ప్రధాన కారణంగా నిలిచాయి.

INDIA-696x392-1 నరబలిస్తున్న నాయకులు !
Photo credit :The Print

ఆ ఐదు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో..

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నప్పటికీ దేశంలోని పలుచోట్ల ఎన్నికలు నిర్వహించడం కరోనా విజృంభ‌ణ‌కు కారణమైంద‌ని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కేరళలో ఏప్రిల్ 6- ఏప్రిల్ 21 మధ్య కాలంలో కరోనా ప్రభావం 349 శాతం పెరిగింది. అంటే ఈ సమయంలో యాక్టివ్ కేసులు 30,228 నుంచి 1,35,910కి పెరిగాయి. ఇదే సమయంలో ఎన్నికలు జరిగిన తమిళనాడులో 229 శాతం పెరిగి యాక్టివ్ కేసులు 84,361 చేరాయి. అలాగే, పుదుచ్చేరిలో క్రియాశీల కేసులు 204 శాతం పెరిగి 5,404 పెరిగాయి.

మూడు దశల్లో ఎన్నికలు జరిగిన అసోంలోనూ ఎన్నికల కారణంగా కరోనా ప్రభావం భారీగా పెరిగింది. అసోంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 11 మధ్య 83 శాతం, ఏప్రిల్ 1-16 మధ్యలో 187 శాతం, ఏప్రిల్ 6-20 మధ్య 344 శాతం యాక్టివ్ కేసులు పెరిగాయి. ఇదిలా ఉండగా రాష్ట్రం కోవిడ్-19 నుంచి విముక్తి పొందిందనీ, ముసుగులు ధరించాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రులు నిర్లక్ష్య వ్యాఖ్యలు చేయడం కరోనా పెరగడానికి కారణమైందని నిపుణులు పేర్కొంటున్నారు.

KERALA-1-696x392-1 నరబలిస్తున్న నాయకులు !
Photo credit :The Print

బెంగాల్లో ఏకంగా 530 శాతం పెరిగిన కరోనా

ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగిన బెంగాల్లోనూ రికార్డు స్థాయిలో కరోనా ప్రభావం పెరిగింది. మొదటి దశ ఎన్నికలు, జరిగిన మార్చి 27-ఏప్రిల్ 11 మధ్య (పక్షం రోజుల కాలం) కరోనా 420 రెట్లు పెరిగింది యాక్టివ్ కేసులు 4,608 నుంచి 23,981కి పెరిగాయి. రెండో దశలో ఏకంగా 530 శాతం యాక్టివ్ కేసులు పెరిగాయి. ఆ తర్వాత జరిగిన పోలింగ్ పక్షం రోజుల కాలంలో వరుసగా 357, 315, 162 శాతం యాక్టివ్ కేసులు పెరిగి 1,18,94 కు చేరాయి. రాబోయే కాలంలో ఎన్నికల ప్రభావంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు పెరిగే అవకాశముందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

WB-696x392-1 నరబలిస్తున్న నాయకులు !
Photo credit :The Print

సూపర్ స్ప్రెడ్డ‌ర్స్ గా ఎన్నికలు

దేశంలో కరోనా డెంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. “భారత ఎన్నికల కమిషన్ బాధ్యతారాహిత్యం కరోనా విజృంభణకు కారణమైంది. మీపై మర్డర్ కేసు పెట్టాలి” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పోలింగ్ నేపథ్యంలో దేశంలో కరోనా ప్రభావం భారీగా పెరిగిందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు వైరస్ వ్యాప్తికి మరింత కారణమయ్యాయని చెబుతున్నారు. అలాగే హోలీ సైతం కరోనా వ్యాప్తికి కారణమైందని పేర్కొంటున్నారు.

Share this content:

You May Have Missed