ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్: బీసీసీఐ నిర్ణయాలతో ఎంఎస్ ధోనికి న‌ష్ట‌మేంటి?

IPL 2025 Retention Rules, MS Dhoni, IPL 2025
IPL 2025 Retention Rules, MS Dhoni, IPL 2025

దర్వాజ – హైదరాబాద్

IPL 2025 Retention Rules : ఐపీఎల్ 2025 కోసం కొత్త రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ రూల్స్ ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్లు, క్యాప్డ్ ప్లేయ‌ర్లు ఉంటారు. ఒక రైట్ టు మ్యాచ్ (RTM) ఆప్షన్ కూడా ఉంది.

ఐపీఎల్ 2025 రిటెన్షన్ రూల్స్ ఏమిటి?

సాలరీ క్యాప్ పెంపు:

    జట్లకు సాలరీ క్యాప్ రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లకు పెంచారు.
    రిటైన్ చేసుకునే ఐదుగురు ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో మెగా వేలంలోకి త‌క్కువ మొత్తంలో ఫ్రాంఛైజీలు వెళ్తాయి.

    విదేశీ ఆటగాళ్లపై నియంత్రణ:

      విదేశీ ఆటగాళ్లు భారత ఆటగాళ్ల కంటే ఎక్కువ ధర పొందకుండా నియంత్రణలు కూడా తీసుకువ‌చ్చింది.
      ఒక భారత ఆటగాడు అత్యధికంగా రూ.18 కోట్లు పలికితే, విదేశీ ఆటగాళ్లు ఆ మొత్తాన్ని మించకుండా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆట‌గాళ్లు మ‌ధ్య‌లో వెళ్ల‌కుండా క‌ఠిన రూల్స్ తీసుకువ‌చ్చింది.

      ప్లేయర్ ఫీజు కూడా పెంపు:

      ప్రతి ప్లేయర్ ఆడే మ్యాచ్‌కు రూ.7.50 లక్షల ఫీజు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఐపీఎల్ మొత్తం ఆడే ఒక్కో ప్లేయ‌ర్ వేలం ధ‌ర‌తో పాటు కోటి రూపాయ‌ల‌కు పైగా మ్యాచ్ ఫీజును అందుకుంటాడు.

        బీసీసీఐ ఐపీఎల్ కొత్త రూల్స్ ఎంఎస్ ధోనికి షాక్ :

        బీసీసీఐ ఐపీఎల్ 2025 కోసం తీసుకువ‌చ్చిన కొత్త రూల్స్ ఎంఎస్ ధోనికి షాకిచ్చాయ‌ని చెప్పాలి. ఈ విష‌యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ రిటెన్షన్ వ్యూహాన్ని నిర్ణయించడంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే ధోని అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ లిస్టులోకి వ‌స్తాడు. కాబ‌ట్టి అత‌ని గ‌త వేలం ధ‌ర రూ.12 కోట్ల‌కు బ‌దులు ఇప్పుడు అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ గా గ‌రిష్టంగా రూ.4 కోట్ల వ‌ర‌కు అందుకుంటారు. ఇది చెన్నై టీమ్ కు లాభంగా మారింది. ఎంఎస్ ధోని-సీఎస్కే అభిమానులు జట్టు మేనేజ్‌మెంట్ రిటెన్షన్‌ను ఎలా నిర్వహిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

        Related Post