Loading Now
Kangana Ranaut-Indian independence movement

Kangana Ranaut: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్య్రం’ : కంగనా రనౌత్

ద‌ర్వాజ‌-ఢిల్లీ

Kangana Ranaut_Indian independence movement : బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ దేశ స్వాతంత్య్రంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ మీడియా టైమ్స్ నౌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశానికి స్వ‌తంత్య్రం 1947లో రాలేద‌నీ.. కేవ‌లం అది భిక్షమేనంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 2014లోనే దేశానికి అలస‌లైన స్వాతంత్య్రం వ‌చ్చిందంటూ చెప్పుకొచ్చారు. “1947లో భార‌త్ స్వాతంత్య్రం పొంద‌లేదు. అది కేవలం ఒక భిక్ష. మనందరికి 2014లోనే అసలైన స్వాతంత్య్రం వచ్చింది. ఆనాడు భిక్షగా పొందిన దానిని మనం స్వాతంత్య్రంగా ఎలా భావిస్తాం?. దేశాన్ని కాంగ్రెస్‌కు వదిలేసి బ్రిటిషర్లు వెళ్లిపోయారు. బ్రిటిషర్ల పాలనకు మరో కొనసాగింపు రూపమే కాంగ్రెస్‌” అంటూ వ్యాఖ్య‌లు చేశారు.

ఇక కంగ‌నా చేసిన వ్యాఖ్య‌ల‌పై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆనాడు గాంధీ, భగత్ సింగ్ వంటి అనేక మంది స్వాతంత్య్ర‌ సమర యోధులు దేశదాస్య శృంఖ‌లాలు తెంచ‌డానికి ప్రాణాల‌కు తెగించి పోరాడారు.. వారి ఆత్మ బలిదానాలకు విలువే లేదా? అంటూ స‌ర్వ‌త్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కాగా, గ‌త కొంత కాలంగా కంగ‌నా బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్య‌లుచేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు సైతం ఇటీవ‌ల ప‌లు అవార్డులు సైతం ప్ర‌టించింది. దీంతో బీజేపీపైనా ప‌లువురు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

దేశద్రోహం కేసు నమోదుచేయాలంటూ..

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా కంగ‌నా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను పిచ్చితనంగా భావించాలా? లేక దేశద్రోహంగా భావించాలా? అని ప్రశ్నించారు. కంగ‌నాపై దేశ‌ద్రోహం కేసు న‌మోదుచేయాలంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు, నెటిజ‌న్ల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో ఆమెపై పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి.

3 Roses: నేను నీ కంటే చాలా పెద్దదాన్ని : పూర్ణ

 బాబోయ్ బాలయ్య ఏంటా ఎనర్జీ.. అన్ స్టాబబుల్ స్టేజిపై బాలయ్య అదిరిపోయే స్టెప్పులు

Jai Bhim: సినతల్లికి మంచి ఇల్లు కట్టిస్తా; లారెన్స్

Assam Road Accident : త్రిపుర‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది మృతి

T20 World Cup 2021: ఫైన‌ల్‌కు న్యూజిలాండ్

Malala Yousafzai: వివాహబంధంలోకి మలాలా

IFFI Awards 2021: ఎక్కాడా తగ్గేదే లే అంటున్న సంమంత..

Share this content:

You May Have Missed