దర్వాజ-హైదరాబాద్
Lal Bahadur Shastri : జై కిసాన్.. జై జవాన్ నినాదమిచ్చిన మహా నేత, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతి నేడు. అక్టోబర్ 2 న జన్మించిన శాస్త్రి చివరి శ్వాస వరకు దేశానికి అంకితం చేసిన గొప్ప దేశ భక్తుడు. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన దేశభక్తుల్లో ప్రముఖుడైన ఆయన దేశ రెండవ ప్రధానిగా సేవలందించారు. పాకిస్థాన్‌తో సంధికోసం విదేశాలకు వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి అక్కడే అనుమానస్పదంగా మరణించారు.
1965 లో ఇండో-పాక్ యుద్ధం తరువాత, జనవరి 10, 1966 న, శాస్త్రిజీ పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి తాష్కెంట్ కు వెళ్లారు. అక్కడ సమావేశం జరిగిన కొన్ని గంటల తర్వాత శాస్త్రీ అనుమదాస్పదంగా మరణించారు. అయితే గుండెపోటుతో మరణించాడని చెప్పారు. ఆయన మృత దేహాన్ని దేశానికి తీసుకువచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు మృత దేహం చూసి నీలం రంగులో ఉందని ఎవరో విషం పెట్టి హత్య చేసారంటూ ఆరోపణలు చేశారు. అంతేకాదు అతని పొత్తికడుపు , మెడ వెనుక భాగంలో కత్తిరించిన గుర్తులు గుర్తించారు. దీంతో ఆయన మరణంపై అనేక అనుమానాలు మొదలయ్యాయి.
ఇక శాస్త్రీ మరణంపై రాజ్ నారాయణ్ చేసిన విచారణ రికార్డ్స్ సైతం కనిపించకుండా పోయాయి. ఈ కేసు కోర్టులో ఉండగా కేసులో సాక్ష్యం చెప్పాల్సిన శాస్రి గారి పర్సనల్ డాక్టర్ డాక్టర్ RN చుగ్ , పర్సనల్ అటెండెంట్ రామ్ నాథ్ వీరిద్దరు కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పార్లమెంటరీ బాడీని కలవడానికి ముందు శాస్త్రిజీ ఇంటిని సందర్శించిన రామ్ నాథ్ ను కూడా కారు ఢీకొట్టింది. శాస్త్రి మరణం వెనుక CIA హస్తం ఉందని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇలా లాల్ బహదూర్ శాస్త్రి మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.
యూపీలో మరో దారుణం.. బాలికపై లైంగిక దాడి.. హత్య !
నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్
అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
కుండపోత వర్షం.. నీటమునిగిన హైదరాబాద్
పెగాసస్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మమత ఫైర్