దర్వాజ-యాదిలో (ఓపెన్ పేజీ)
ఈ ప్రపంచంలో ఎంతో తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా, ఎవరూ ఇవ్వరూ ఇవ్వలేరు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. అలాంటి అమ్మతనాన్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తించే ప్రతీ మహిళకు పాదాభివందనం.
అయితే పూర్వం ఈ మహిళల పరిస్థితి ఏంటి ? కనీసం బైటికి కూడా రానిచ్చేవారు కాదు. చదువుసంధ్యల ఊసే లేదు. ఆడుకునే వయసులో వారికి పెండ్లిలు చేసి అత్తారింటికి పంపేవారు. అక్కడ వాళ్లు ఎదుర్కొన్న బాధల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చిన్న వయసులో పిల్లలకు జన్మనిచ్చి వాళ్లు పడిన బాధల గురించి తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు.
అయితే ఈ మధ్య కాలంలో మహిళలకు కొంత స్వేచ్ఛ వచ్చింది. దాంతో బయటకు రాగలుగుతున్నారు. చదువుకోగలుగుతున్నారు. తన సత్తాను ప్రంపంచ నలుములకు తెలియజేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎంతో సంతోషించాల్సివి. ఇలాగే మగువ ఇంకా ముందుకు పోవాలని కోరుకోవాల్సినవి.

అయితే, మారుతున్న ఆధునీక సామాజిక మార్పుల కారణంగానేమో కొందరు మహిళలు అమ్మతనానికి మచ్చలు తెచ్చే పనులు సైతం చేస్తున్నారు. ఆప్యాయత, ఆనురాగాలను చూపే మహిళల్లో ఈ వికృత చేష్టలేంటని ఎంతో మంది తలలు పట్టుకుంటున్నారు.
అవును మహిళలు కూడా భయంకరమైన నేరాలు చేస్తున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే.. కామం మత్తులో కొందరు మహిళలు చేస్తున్న నేరాలు చూస్తే.. తల పగిలిపోయేంత పని అవుతుంది. కామంతో కళ్లు మూసుకుంటే చుట్టూ ఏది కనిపించదట. అందులో పడితే మంచి చేడులను కూడా మర్చిపోవాల్సిందే.. ఒకరకమైన పిచ్చిలోకి పోవాల్సిందే. దానికోసం ఏం చేయడానికైనా వెనకాడరని సైకాలజిస్టులు చెబుతున్నారు.
భార్యభర్తల బంధం ఎంతో అపురూపమైంది. అలాంటి బంధం మధ్యలోకి మూడో వ్యక్తిని రానివొద్దు. అలా చస్తే.. భార్యభర్తల మధ్య గొడవలు వస్తాయి. దాంతో ఒక్కోసారి ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇంకా కొంత మంది కన్న పిల్లలను కూడా కడతేర్చేందుకు వెకకాడటం లేదు. అయితే.. ఈ పనులు కేవలం పురుషులు మాత్రమే చేస్తున్నారు అనుకుంటే పొరపాటు పడినట్లే.. పర పురుషుల వ్యామోహంలో పడి పలువురు మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఆ అక్రమ సంబంధాన్ని కాపాడుకోవడానికి కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను కూడా కిరాతకంగా కడతేర్చుతున్నారు.
అమ్మతనంలో ఇలాంటి రాక్షస గుణమేలా అని ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు. తన పిల్లలను ఎవరు తిట్టినా కొట్టినా.. ఓ యుద్ధమే చేసే ఆ తల్లి తన పిల్లలను చంపేంత క్రూరంగా ఎలా తయారవుతోందని ఆలోచిస్తే భయమేస్తోంది. దీనికి కారణం తన భర్త, కుటుంబ పరిస్థితులు కావొచ్చు. కానీ తన ఫ్యామిలిని చంపుకునేంత క్రూరత్వం ఎలా వస్తుంది ? కొన్ని కేసులను చూస్తే.. ఈ విషయాలు అర్థమవుతాయి.

కొన్ని నెలల ముందు వైజాగ్ లో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఒక్క దెబ్బతో సదరు మహిళ కూతురిని గుండె పగిలేలా కొన్ని చంపితే.. గుట్టుచప్పుడు కాకుండా తన కూతురి శవాన్ని పాతి పెట్టిన నీచమైన మహిళ మన సమాజంలో ఉంది. మరొక చోట.. ప్రియుడు తన కండ్ల ముందే. తన కొడుకుని కొట్టి చంపేస్తున్నా.. బండరాయిలా చూస్తూ.. కూర్చున్న భయంకరమైన రాక్షస మహిళ కూడా ఉంది.
సంఘాలు వ్యక్తులకు శిక్ష పడాలని ధర్నాలు చేస్తున్నాయి. కానీ.. తప్పుచేసిన వారికి శిక్ష పడాలని కోరుకోవడం లేదు. ఏ సంఘం కూడా న్యాయ పోరాటానికి సిద్ధంగా లేవు. కేవలం వ్యక్తుల కోసం పని చేసే సంఘాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏది ఏమైనా భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కానీ చంపేయడం అనేది పెద్దతప్పు. అందులో కన్న పిల్లలను తోయడం మరీ తప్పు. మీరు ఏం చేసినా కలిసి ఉండలేరు అనుకుంటే.. కోర్టులను సంప్రదించి సంతోషంగా విడిపోండి. పిల్లలను వీలైతే పెంచుకోండి. లేకపోతే ప్రభుత్వాలకు అప్పగించండి. కానీ మీ కామవాంఛలో పసిపిల్లలను భలి చేయొద్దు.

విద్య శ్రీనివాస్
లా స్టూడెంట్,
హైదరాబాద్,
vidyamandali92@gmail.com.
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..