దర్వాజ-హైదరాబాద్
mother’s day : అమ్మే అవనికి ఆధారం
ఆత్మీయతను పంచి
మమతానురాగాల ఒడిలో మనలను పెంచి
రమణీయమైన ప్రతిరూపాన్ని ఈ లోకానికి పరిచయం చేసిన త్యాగమూర్తి… అమ్మ
అమృతం కన్నా మిన్న… మా అమ్మ మనసు వెన్న
అమ్మ లోని అనురాగాన్ని…ఆత్మీయత ను పంచుకున్న నేనూ
తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది
వాళ్ళ లాలనలో తన బాల్యాన్ని చూసుకుంటది
మదిని మురిపించే మధుర జ్ఞాపకాల తోరణం మా అమ్మ
అనురాగానికి ప్రతిబింబం మా అమ్మ
ఆత్మీయత కు ఆనవాళ్ళు మా అమ్మ
అందుకే అమ్మే అవనికి ఆధారం..
బాలలం మేము బాలలం భావి తరపు బంగారు భవితలం అంటూ తన పిల్లలు అంటూ…
అమ్మ పసి వయసును తడుముకుంటుంది
మన భవితకు పునాదులు వేసి బహు దూరంగా ఉన్న ప్రతిరూపం ఆనవాళ్లు
నిన్న నేడు రేపు….. అనే ప్రతిరూపానికి తీపి గుర్తు
మా అమ్మ
వానప్రస్థ ఆశ్రమాల పేరుతో వనవాసాకు పంపడం
వారిని భారంగా భావించి వృద్ధాశ్రమానికి తరలిస్తుంటే
మారు మాట మాట్లాడలేక ఆవిరవుతున్న కన్నీటి ధార
ఎన్నో ఆశలు ఎన్నెనో ఆశయాలతో మనల్ని పెంచి
కడకు వారు కన్నీటి తీరంలో బతుకులీడుస్తున్నారు
మదర్స్ డే….. అనగానే
ఒకరోజు స్టేటస్
ఒకరోజు పోస్టింగ్
ఒకే రోజు అమ్మను గుర్తు పెట్టుకోవడం కాదు
జన్మాంతం తల్లిదండ్రుల మధుర జ్ఞాపకాలను
వారిచ్చిన ఆప్యాయత అనురాగాలను కలకాలం
కమనీయ దృశ్యాలుగా మలచి వారిని సాకాలి
మలి వయసులో వారి ఆలోచనలు వ్యతిరేకించకండి
మనకోసం వారు చేసిన త్యాగం అనిర్వచనీయమైనది
అమ్మ మీకు పాదాభివందనం
మరుజన్మంటూ ఉంటే మళ్ళీ కొడుకుగానే పుట్టాలి
అమ్మకు వందనం..
అమ్మ పంచిన ప్రేమకు అభివందనం
ఈ జన్మనిచ్చిన మా అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చకోలేను
అమ్మానాన్నతో సహకరించండి
వారి సంతోషంలో పలుపంచుకోండి
అవసానదశలో వారికి అండగా ఉండండి..
— పండుగ ప్రభాకర్ ముదిరాజ్. MA,MEd,(LLB)
వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ యాస భాషా పరిరక్షణ సమితి..
ఉస్మానియా విశ్వవిద్యాలయం.
తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్
విద్య ఉద్యోగ రిజర్వేషన్ల సమితి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Share this content: