Breaking
Tue. Nov 18th, 2025

ముంబ‌యిని ముంచెత్తిన భారీ వ‌ర్షాలు

Mumbai rain
Mumbai rain
  • 32 కు పెరిగిన మ‌ర‌ణాలు

ద‌ర్వాజ‌-ముంబయి

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిని భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండ‌పోత‌గా కురుస్తున్న వ‌ర్షాల‌తో న‌గ‌రం చిగురుటాకుల వ‌ణికిపోతున్న‌ది. చాలా ప్రాంతాలు ఇప్ప‌టికే నీట‌మునిగాయి. వ‌ర‌ద నీటి ప్ర‌వాహంతో వీధులు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. ప‌లు చోట్ల న‌డుముల లోతువ‌ర‌కు నీటి ప్ర‌వాహం కొన‌సాగుతోంది.

కాగా, భారీ వ‌ర్షాల సంబంధిత కార‌ణాల కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 32కు పెరిగింది. భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలు స్థానిక భరత్‌నగర్ ప్రాంతంలోని ఇళ్లపై పడ్డాయి. దీంతో ఆ ఇళ్లలో నివసిస్తున్న 19 మంది మృతి చెందారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు శిథిలాల నుంచి 16 మందిని రక్షించాయి.

https://twitter.com/catchsalil/status/1416615160203075585

Related Post