Breaking
Tue. Nov 18th, 2025

టోక్యో ఒలంపిక్స్ భార‌త్ తొలి స్వ‌ర్ణం

Neeraj Chopra First Indian To Win Olympic Gold In Athletics
Neeraj Chopra First Indian To Win Olympic Gold In Athletics

దర్వాజ-న్యూఢిల్లీ

Neeraj Chopra: టోక్యో ఒలంపిక్స్ లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు అథ్లెటిక్స్ లో తొలి స్వర్ణం అందించాడు. ఒలింపిక్స్ లో భారత్ కు ఇప్పటివరకు ఇతర క్రీడాంశాల్లో స్వర్ణం అందినా, అథ్లెటిక్స్ స్వర్ణం అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో భారత క్రీడారంగానికి ఆ లోటు కూడా తీరిపోయింది. అలాగే, ఈ ఒలంపిక్స్ లో భార‌త్‌కు తొలి స్వ‌ర్ణం ఇదే.

జావెలిన్ ను 87.58 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. ఈ పతకంతో భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో మొత్తం 7 పతకాలు లభించినట్టయింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి.

Related Post