Breaking
Fri. Nov 15th, 2024

ఆ ట్వీట్ల‌ను తొల‌గించండి !

On Centre’s request Twitter takes down 52 tweets criticising India’s handling of corona
On Centre’s request Twitter takes down 52 tweets criticising India’s handling of corona
  • క‌రోనా నిర్వ‌హ‌ణ‌పై కేంద్రంపై విమ‌ర్శ‌లు
  • వాటిని తొల‌చాలంటూ ఆదేశాలు.. పోస్టుల‌ను తొల‌గించిన ట్విట్ట‌ర్ : రిపోర్ట్స్

దేశంలో క‌రోనా విజృంభ‌ణ.. క‌రోనా కొత్త కేసు‌లు, మ‌ర‌ణాలు, టీకాలు, ఆస్ప‌త్రుల్లో ప‌డ‌క‌ల కొర‌త నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌రోనా ప‌ట్ల ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లొస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ చేసిన ప‌లు ట్వీట్ల‌ను తాజాగా ట్విట్ట‌ర్ తొల‌గించింది.

ఇందులో 52 ట్వీట్లు ఉన్నాయ‌ని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. వీటిని కేంద్ర ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న మేర‌కే తొల‌గించిన‌ట్టు తెలిపాయి. ఇందులో అధికంగా క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ నిర్వ‌హ‌ణ పై కేంద్ర ప్ర‌భుత్వ తీరును విమ‌ర్శించిన‌వే ఉన్నాయని ‘మీడియా నామా’ పేర్కొంది. తొల‌గించిన ట్వీట్ల‌లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, బెంగాల్ మినిస్ట‌ర్ మొలోయ్ ఘ‌ట‌క్‌, న‌టుడు వినీత్ కుమార్ సింగ్‌, ఫిల్మ్ మేక‌ర్స్ వినోద్ కాప్రి, అవినాష్ దాసుల ట్వీట్లు కూడా ఉన్నాయి. ట్విట్ట‌ర్ తీసుకున్న చ‌ర్య‌ల గురించి కాప్రి ధృవీక‌రించారు.

https://twitter.com/FriedrichPieter/status/1385699960310673414

ఎంపీ రేవంత్ రెడ్డి క‌రోనా మ‌ర‌ణాల సామూహిక ద‌హ‌న సంస్కారాల చిత్రాన్ని ట్వీట్ చేశారు. అలాగే, భార‌త్ లో నిత్యం రెండు ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ కూలిపోయింద‌ని పేర్కొన్నారు. బెంగాల్ న్యాయ‌శాఖ మంత్రి దేశంలో వ్యాక్సిన్ల కొర‌త నేప‌థ్యంలో.. టీకాల‌ను ఎగుమ‌తి చేస్తున్నందుకు ప్ర‌ధాని మోడీని విమ‌ర్శిస్తూ చేసిన ట్వీట్ ను కూడా తొల‌గించిన‌ట్టు మీడియా నామా నివేదించింది.

క‌రోనా మ‌హ‌మ్మారి, మందుల కొర‌తల మ‌ధ్య చేస్తున్న రాజ‌కీయ ర్యాలీల‌ను విమ‌ర్శిస్తూ నటుడు వినీత్ కుమార్ సింగ్ చేసిన ట్వీట్‌ సెన్సార్ చేయ‌బ‌డింది. అలాగే, వినోద్ కాప్రి సామూహిక దహన సంస్కారాల వీడియోను ట్వీట్ చేశారు. దీనికి మరిన్ని దహన సంస్కారాలు చేస్తామనే వాగ్దానం నెరవేరిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా యూపీలో హిందూ, ముస్లీం ద‌హ‌న సంస్కారాల మైదానాల గురించి మోడీ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

vdpgiaygfp-1619280296 ఆ ట్వీట్ల‌ను తొల‌గించండి !

కాగా, గ‌తేడాది విధించిన లాక్‌డౌన్ లో వ‌ల‌స కార్మిక సంక్షోభంపై నిర్మించిన కేఎం 1232 డ్యాక్యుమెంట‌రీని ఇటీవ‌ల విడుద‌ల చేసిన కాప్రి.. సెన్సార్ షిప్‌కు వ్య‌తిరేకంగా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ లేఖ రాశాన‌ని తెలిపారు. అందులో “భారతదేశం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆక్సిజన్, మందులు లేకపోవడంతో నిత్యం వేలాది మంది చనిపోతున్నారు. రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి బదులుగా.. స్వేచ్ఛాయుత, స్వతంత్ర గొంతుక‌ల‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ట్విట్టర్ కు లేఖ రాస్తున్న ఈ అమానుష, అనైతిక ప్రభుత్వ తీరును బహిర్గతం చేయడం, నిజం చెప్పడం చిత్ర నిర్మాతగా, జర్నలిస్ట్ గా నా నైతిక కర్తవ్యం” అని కాప్రి రాసిన‌ట్టు స‌మాచారం.

కాగా, ఇలా భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను హ‌రించే విధంగా ప్ర‌భుత్వం ముందుకు సాగుతుండ‌టంపై నెటిజ‌న్ల నుంచి అభ్యంత‌రం వ్య‌క్త మ‌వుతోంది.

Share this content:

Related Post