• పెగసస్‌పై పార్లమెంట్‌లో చర్చించాల్సిందే..
• కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
దర్వాజ-న్యూఢిల్లీ
Rahul Gandhi_ Pegasus : పెగాసస్ స్పైవేర్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ ప్రయివేట్ పార్టీ పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేయదు. ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేయగలదు. దానిని ఎవరి మీద ప్రయోగించారు? పెగాసస్ డాటా మరేదైనా దేశంలో ఉందా? లేదా అది భారత ప్రభుత్వం వద్దనే ఉందా? అని మూడు ప్రశ్నలను వేశాం. ఇంతవరకు మాకు సమాధానం రాలేదు. ఇది దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి’ అని రాహుల్ అన్నారు.
అలాగే, పెగాసస్ స్పైవేర్‌పై పార్లమెంట్‌లో చర్చించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో లేవదీస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. జర్నలిస్టులు, సామాజిక వేత్తలు, ఆర్థిక నిపుణులు, ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానులు, బీజేపీ మంత్రులు సహా న్యాయస్థానాల సిబ్బంది తదితరులపై పెగాసస్‌ను ఉపయోగించారని తెలిపారు.
ఇదిలావుండగా, ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ ఎస్‌వో గ్రూప్‌నకు చెందిన పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి వ్యక్తులపై నిఘాపెట్టారని ఇటీవల కథనాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దేశంలో ఈ అంశం తీవ్ర దుమారమే రేపింది. తాజాగా సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపింది. పెగాసస్‌పై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరికేనా…?
నేను బీజేపీ ఎంపీని.. ఈడీ నా జోలికి రాదు
Ind Vs Pak : భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్
టాస్ కాయిన్‌తో పాక్ ఎకానమీని పెంచుకుంటారట.. ప్రముఖ వ్యాపారవేత్త సెటైర్లు
T20 World Cup: విండీస్‌పై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాలో గెలుపు
T20 World Cup: విండీస్ చెత్త రికార్డు..
T20 World Cup: ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా బోణీ..
పెట్రోల్ పన్నులతోనే.. ఫ్రీ వ్యాక్సిన్లు.. :కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌పూరీ
Share this content: