దర్వాజ-సినిమా
‘ఒకలైలా కోసం ’ సినిమాతో పరిచయమై అతికొద్ది కాలంలోనే సినీ రంగాన్ని ఏలుతున్న భామల్లో పూజా హెగ్డే ఒకరు. అబ్బురపరిచే నటనతో, సన్నజాజి నడువొంపుతో ఈ చిన్నది కుర్రకారు మనసును దోచుకుంటూనే ఉంది. కంటెంట్ నచ్చితే చాలు.. చిన్న, పెద్ద హీరో అంటూ తేడా లేకుండా నటిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతూనే ఉంది. సినిమాల మీద సినిమాల్లో నటిస్తూ ఈ చిన్నది ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ కుర్రది ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో కూడా నటిస్తోంది.
ఇదిలా ఉంటే మాటల మాంత్రికుడు, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అలా వైకుంఠపురం’ సినిమా ఏ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించే చెప్పాల్సిన అవసరం లేదేమో. ఈ సినిమాలో బన్ని సరసన బుట్టబొమ్మగా పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు గాను ఈ బుట్టబొమ్మకి సాక్షి అవార్డ్ ఉత్తమ నటిగా అవార్డును ప్రదానం చేసింది. నిన్న రాత్రి హైదరాబాద్ లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6, 7 కి ఎడిషన్ కు అవార్డుల ప్రోగ్రాంను ఏర్పాటుచేసింది.
అందులో అల వైకుంఠపురం సినిమాకు మొత్తంగా 5 అవార్డులు లభించాయి. అందులో హీరో బన్నీ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకోగా.. పూజా హెగ్డే ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది. అలాగే ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్, అలాగే నిర్మాత రాధాకృష్ణ ఉత్తమ చిత్రం అవార్డును అందుకున్నారు. అలాగే ఎస్ఎస్ థమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును కైవసం చేసుకున్నారు.
డిప్రెషన్ ను తగ్గించే చిట్కాలివిగో..
సైదాబాద్ ఘటన రాజు మరణంపై అనుమానలొద్దు: డీజీపీ మహేందర్ రెడ్డి
సింగరేణి కాలనీ ఘటన నిందితుడు ఆత్మహత్య
మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్సవం’
గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు