Breaking
Tue. Nov 18th, 2025

rythu bharosa: “భరోసా” బంద్.. అర్బన్ మండలాల్లో అగ్రికల్చర్ లేదట..!

Rythu Bharosa Denied to Urban Mandals: Farmers Protest as Government Fails Promise
Rythu Bharosa Denied to Urban Mandals: Farmers Protest as Government Fails Promise

దర్వాజ-రంగారెడ్డి ప్రతినిధి

  • వారికి రైతు భరోసా రాదట
  • రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరి
  • ఔటర్ సమీపంలోని మండలాల్లో నిలిపివేత
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
  • ఎన్నికలకు ముందు, తర్వాత పొంతనలేని వైనం
  • రంగారెడ్డి జిల్లాలోని 9 మండలాలు
  • మేడ్చల్ జిల్లాలో 8 మండలాల్లో మొండి’చేయి’

భరోసా నిలిచిన 17మండలాలు..

ఇబ్రహీంపట్నం, అబ్దులాపూర్మెట్, మహేశ్వరం, బాలాపూర్, హయత్ నగర్, రాజేంద్రనగర్, గండిపేట , శంషాబాద్, శేరిలింగంపల్లి, మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, శామీర్ పేట, కీసర, ఘాట్ కేసర్, దుండిగల్, అల్వాల్, బాచుపల్లి, మేడిపల్లి మండలాలున్నాయి.

భరోసాపై మాట తప్పిన ప్రభుత్వమంటూ విమర్శలు

‘భరోసా’ లేదు.. అంతామోసం.. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్తోంది. మేం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేలిస్తాం.’ అంటూ ఎన్నికల ప్రచారంల కాంగ్రెస్ హామీలిచ్చింది. అధికారం చేపట్టాక మాటతప్పింది. అందరికీ కాదు.. కొందిరికే భరోసా వేస్తామని ఆపింది. అధికారం చేపట్టిన మొదటి రెండు పంటలకు భరోసా పూర్తిగా నిలిపివేసింది. ఇక గత యాసంగీలో సాగు సర్వే నిర్వహించింది. సాగు చేస్తున్న వారందరికీ భరోసా డబ్బులు వేయకుండా మండలానికి ఒక్క గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసింది. ఆ గ్రామానికి మాత్రమే భరోసా వేసి ఇతర గ్రామాల రైతులకు మోసం చేసిందని రైతులు, పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు.

అర్బన్ మండలాల్లో నిలిపివేత..

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని క్రమంగా ఎత్తేసేందుకే కుట్ర పన్నుతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలో తాము రూ.15వేలకు పెంచి రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రైతు భరోసాను క్రమంగా ఎత్తేసేందుకు అనేక రూపాల్లో సాకులు వెతుకుతుంది. మొదట సాగు చేసే రైతులకే రైతు భరోసా అని చెప్పి రెవెన్యూ, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి సాగు చేసిన భూముల వివరాలు సేకరించారు.

farmer-7970051_1280-1024x683 rythu bharosa: "భరోసా" బంద్.. అర్బన్ మండలాల్లో అగ్రికల్చర్ లేదట..!

ఆ మేరకు రైతు భరోసా వేస్తామని చెప్పిన ప్రభుత్వం మండలానికి ఒకే గ్రామాన్ని ఎంపిక చేసి ఆ ఒక్క గ్రామానికి మాత్రమే పరిమితం చేసింది. వారికి మాత్రమే రైతు భరోసా వేసి చేతులు దులుపుకుంది. ఎలాగో యాసింగి సాగులో రైతు భరోసా రాకపోయినా.. కనీసం వానాకాలం పంటలకైనా రైతు భరోసా వస్తుందని రైతాంగం ఆశగా ఎదురు చూశారు. కానీ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. కేవలం గ్రామీణ ప్రాంతాలైన మండలాలకు మాత్రమే ఐదు ఎకరాల లోపు కలిగిన రైతులకు మాత్రమే నిన్నటి వరకు భరోసా వేసింది. ఇక ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న మండలాలకు మొండి చేయి చూపింది. ఈ ప్రాంతాల్లో వ్యవసాయం సాగు చేయడం లేదని ప్రభుత్వం కుంటి సాకులు వెతుకుతోంది.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఔటర్రింగ్ రోడ్డు సమీపంలోని ఇబ్రహీంపట్నం, అబ్దులాపూర్మెట్, మహేశ్వరం, బాలాపూర్, హయత్ నగర్, రాజేంద్రనగర్, గండిపేట , శంషాబాద్, శేరిలింగంపల్లి, మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, శామీర్ పేట, కీసర, ఘాట్ కేసర్, దుండిగల్, అల్వాల్, బాచుపల్లి, మేడిపల్లి మండలాలోని రైతులకు భరోసాను పూర్తిగా నిలిపి వేసింది. అంటే క్రమంగా రైతు భరోసా అనే పథకాన్ని లేకుండా చేసేందుకు ప్రభుత్వం రోజుకో వింత రాజకీయాలకు పూనుకుంటుందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని రైతు భరోసాకు అర్హులైన రైతులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు.

భరోసా అర్హులు..

రంగారెడ్డి జిల్లాలో 48,154 ఎకరాలకు గాను 36, 220 మంది రైతులు అర్హులు ఉన్నారు. వారికి రైతు భరోసా పడాల్సి ఉంది. ఇక మేడ్చల్ జిల్లాలో 45,103 ఎకరాలలోని 40, 443 మందికి రూ.24 కోట్ల మేర డబ్బులు పడాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ సమీపంలోని మండలాల్లో రైతు భరోసా కోత విధించడం వల్ల ఈ రైతులు అనరులతో జాబితాలో చేరారు.

జిల్లాలో రైతు భరోసా నిధులు..

జిల్లాలోని గ్రామీణ గ్రామీణ మండలాల్లో ఐదు ఎకరాలలోపు రైతు భరోసాను ప్రభుత్వం వేసింది. రెండు ఎకరాలలోపు కలిగిన 15,46,22 మంది రైతులకు రూ.81,34,19,492లను వేసింది. మూడు ఎకరాల వరకు కలిగిన 1,57,435 మంది రైతులకు 5. 12,78,89,726 . 2.06,736 మంది రైతులకు రూ.1,65,95,67,080లను వేసింది. ఐదు ఎకరాల విస్తీర్ణం కలిగిన 2,19,938 మంది రైతులకు రూ.199,35,21,916 జమ చేశారు .

ఆందోళనలో రైతాంగం..

అర్బన్ మండలాలోని రైతులకు రైతు భరోసా నిలిపివేయడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వ్యవసాయ కార్యాలయానికి వచ్చి వాకబ్ చేస్తున్నారు. తమకు ఎందుకు భరోసా రావడం లేదని అధికారులను నిలదీస్తున్నారు. రైతులకు సమాదానం చెప్పలేక వ్యవసాయాధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దరఖాస్తులు స్వీకరిస్తూ ప్రభుత్వానికి నివేధిస్తామంటున్నారు. దాంతో ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతూ రైతులు వెనుతిరుగుతున్నారు.

Yadaiah-1024x576 rythu bharosa: "భరోసా" బంద్.. అర్బన్ మండలాల్లో అగ్రికల్చర్ లేదట..!

రైతు భరోసా జమ కాలేదు.. : యాదయ్య, రైతు పోల్కంపల్లి

నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. గత ప్రభుత్వంలో పంట వేయక ముందే, సీజన్ ప్రారంభంలోనే రైతుబంధు జమ అయ్యేది. కాంగ్రెస్ వచ్చాక గత వానకాలం సీజన్లో రాలేదు. యాసంగిలో ఐదెకరాల్లోపు వాళ్లకే ఇచ్చారు. మాకు ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా అందరికీ వస్తాయనే చెబుతున్నారు. ఇంతలో యాసంగి పోయింది. వానకాలం వచ్చింది. ఇప్పుడు కూడా అర్బన్ మండలాలు అంటూ రైతు భరోసా రాదంటున్నారు. అర్బన్ మండలాల్లో పంటలు సాగు కావా?, ఎక్కడ పేద రైతులు ఉండరా?. ప్రభుత్వ ఆలోచన సరికాదు : యాదయ్య, రైతు పోల్కంపల్లి

P-jagan-1024x576 rythu bharosa: "భరోసా" బంద్.. అర్బన్ మండలాల్లో అగ్రికల్చర్ లేదట..!

సాయంపై నమ్మకం లేదు.. : సీపీఐఎం జిల్లా కమిటీ సభ్యులు పి. జగన్

’రైతు భరోసా పంటల సాయం అందుతుందన్న నమ్మకం లేదు. నాకైతే ఆ విశ్వాసం ఎప్పుడో పోయింది. ఇప్పటిదాకా రైతులు వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టూ తిరిగి అలిసిపోయారు. ఎప్పుడెళ్లి అడిగినా అందరికీ వస్తాయన్న సమాధానమే చెబుతున్నారు. కానీ రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో అడిగితే మీకే మెసేజ్ వస్తుందని చెబుతున్నారు. మెసేజ్ రాలేదు. సాయం జమ కాలేదు. ఒక ఆందోళన చేయక తప్పని పరిస్థితి : సీపీఐఎం జిల్లా కమిటీ సభ్యులు పి. జగన్

samel-1024x576 rythu bharosa: "భరోసా" బంద్.. అర్బన్ మండలాల్లో అగ్రికల్చర్ లేదట..!

భరోసా ఇవ్వకుంటే ఉద్యమమే : సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, బోడ సామెల్

రంగారెడ్డి జిల్లాలో రైతు పట్ల ప్రభుత్వం తీరు సరైంది కాదు. కొంతమందికే కాకుండా అందరికీ రైతు భరోసా నిధులు జమచేయాలి. పంటల సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి షరతులు లేకుండా భరోసా వేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు కొర్రీలు పెట్టడం సరి కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం : సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, బోడ సామెల్.

Related Post