Breaking
Tue. Nov 18th, 2025

Rythu Bharosa:  ఔటర్ రింగ్ రోడ్ లోపల సాగు భూములకు రైతు భరోసా

దర్వాజ-రంగారెడ్డి

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న సాగు భూములకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయనుంది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

గత ప్రభుత్వ హయాంలోనే ORR లోపల ఉన్న భూములు రైతు భరోసా నుంచి మినహాయించారని మంత్రి గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, సాగులో ఉన్న ఏ భూములకైనా పథకం వర్తించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఓఆర్ఆర్ సాగు భూములు గణాంకాల ప్రకారం:

  • ORR లోపల భూముల మొత్తం: 2.18 లక్షల ఎకరాలు
  • రియల్ ఎస్టేట్, వాణిజ్య వాడుకలో ఉన్నవి: 98 వేల ఎకరాలు
  • సాగు భూములు: 1.20 లక్షల ఎకరాలు

ఈ సాగు భూములకు రైతు భరోసా పథకం కింద సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు.

వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పాసుపుస్తక ఆధారంగా అర్హులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలిపారు. జూన్ 24 నుండి రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా సాయం జమ కానుంది.

రైతు భరోసా : ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు లబ్ధి కలిగింది?

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,89,15 మంది రైతుల ఖాతాల్లో రూ.372.215 కోట్లు నేరుగా జమ చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ పథకం రైతుల పంట పెట్టుబడులకు భరోసా ఇస్తూ వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన చెప్పారు.

రానున్న రోజుల్లో మరింత మంది రైతులు ఈ పథకానికి అర్హులవుతూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ పరిధిలో ఉన్న నిజమైన సాగు భూములకు పెట్టుబడి సాయం అందడం రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి మరో మెట్టు అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Related Post