దర్వాజ-హైదరాబాద్
Telangana Dalit Bandhu: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుచవ్చిన తెలంగాణ దళితబంధు పథకానికి బ్రేకులు పడ్డాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దళితబంధు అమలును ఆపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీ లేఖ రాసింది. హుజురాబాద్ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందడంతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఓటర్లు ప్రలోభానికి గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర దళితుల అభ్యున్నతి కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు దీనిని నిలిపివేయాలని ఈసీ పేర్కొంది. కాగా, ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితం వెల్లడికానుంది.
కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల టార్గెట్..
వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి చేసిన ఎయిమ్స్ డాక్టర్
కేరళను ముంచెత్తిన వరదలు.. 10 మంది మృతి