Breaking
Tue. Nov 18th, 2025

బిడ్డా గుర్తు పెట్టుకో.. అంతకంటే ఎక్కువే నేను మాట్లాడుతా!

telangana former minister Etala Rajender vs minister gangula kamalakar
telangana former minister Etala Rajender vs minister gangula kamalakar


తెలంగాణ ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌ధ్య మాట‌ల యుద్ధం

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

బిడ్డా గుర్తు పెట్టుకో !

‘బిడ్డా నువ్వు గుర్తు పెట్టుకో.. ఇప్పుడు హుజూరాబాద్ లో నువ్వు చేస్తున్న పనే.. 2023లో కరీంనగర్‌లో నేనూ చేస్తా. అధికారం ఎవడికీ శాశ్వతం కాదు. కరీంనగర్‌ను బొందలగడ్డగా మార్చింది ఎవరో ప్రజలకు తెల్వదా? తోడేళ్లలా మా ప్రాంత ప్రజాప్రతినిధులపై పడుతూ కాంట్రాక్టర్లకు బిల్లులు రావనీ, సర్పంచులు, ఎంపీటీసీలకు నిధులు ఇవ్వబోమని బెదిరిస్తున్న తీరు అందరూ గమనిస్తున్నారు. తాయిలాలు ఇచ్చి నా సైన్యాన్ని బలహీన పరుస్తామనుకుంటే అది తాత్కాలికమే’ అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌పై పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

బిడ్డా.. గిడ్డా అంటే అంతకంటే ఎక్కువే నేను మాట్లాడుతా!

“బిడ్డా.. అంటూ బెదిరిస్తున్నావా.. ఏందీ? అసైన్డ్ భూములు ఆక్రమించి.. అక్రమాస్తులు సంపాదించిన నువ్వు నన్ను వేలెత్తి చూపుతావా? గ్రానైట్ వ్యాపారం ప‌న్నులు ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే మేమంతా ఐదు రెట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. హుజూరాబాద్ లో తమిళనాడు క్వారీలు బొందలగడ్డలు చేస్తుంటే ఎందుకు ఆపలేదు. ఇప్పటికీ అవి నడుస్తున్నాయ్ కదా!. పార్టీ కార్యకర్తలను గొర్రెలతో పోల్చిన నీకు ఆత్మగౌరవమే ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవు” అంటూ తనపై ఆరోపణలు చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కౌంట‌ర్ ఇచ్చారు.

Related Post