ప్ర‌జ‌ల ప్రాణాల‌కు విలువ‌లేదా? ఎన్నిక‌లే ముఖ్యమా?

Telangana High Court Issues Notice To State Election Commission
Telangana High Court Issues Notice To State Election Commission
  • తెలంగాణ స‌ర్కారు, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంపై హైకోర్టు ఆగ్ర‌హం
  • రేప‌టితో ముగియ‌నున్న నైట్ కర్ఫ్యూ…
  • చివ‌రి నిమిషంలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఏంటన్న హైకోర్టు

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

దేశంలోని వివిధ రాష్ట్రాల‌తో పాటు తెలంగాణ‌లోనూ క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా ప‌రిస్థితుల‌పై రాష్ట్ర హైకోర్టు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ఆరా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే గురువారం న్యాయ‌స్థానం క‌రోనా ప‌రిస్థితుల‌పై విచార‌ణ జరిపింది. రాష్ట్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

విచార‌ణ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వ, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తీరుపై న్యాయ‌స్థానం అసంతృప్త వ్య‌క్తం చేసింది. మ‌రీ ముఖ్యంగా క‌రోనా ఉధృతివేళ‌ రాష్ట్రంలోని ప‌లు కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. క‌రోనా విజృంభ‌ణ వేళ ఎన్నిక‌ల‌కు ఎందుకు వెళ్లారు? ప‌్ర‌జ‌ల ప్రాణాలు విలువైనవా? ఎన్నిక‌లా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్న‌ట్టు ఎస్‌ఈసీ అధికారులు న్యాయ‌స్థానికి చెప్ప‌డంతో… అస‌లు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయం అడగాల్సిన అవసరం ఏంటని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిందింది. వివ‌ర‌ణ సంతృప్తిక‌రంగా లేద‌నీ, రెండో ద‌శ క‌రోనా ప్రారంభ‌మైన త‌ర్వాత ఎందుకు నోటిఫికేష‌న్ ఇచ్చార‌ని ప్ర‌శ్నించింది. ఈ విష‌యంపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు ఎస్ ఈసీ త‌దుప‌రి విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని న్యాయ‌స్థానం ఆదేశింది.

అలాగే, రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై కూడా హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రేప‌టితో నైట్ క‌ర్ప్యూ ముగుస్తుంద‌నీ, త‌దుప‌రి తీసుకోబోతున్న చ‌ర్య‌లు ఎంట‌ని ప్ర‌శ్నించింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వ తెలుప‌డంపై న్యాయ‌స్థానం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. చివ‌రి నిమిషంలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఏంట‌నీ, ఒక రోజు ముందే చెబితే జ‌రిగే నష్టం ఎంట‌ని కోర్టు పేర్కొంది.

https://darvaaja.com/corona-crisis_-indian-politics/
https://darvaaja.com/covid-crisis-people-voice/
https://darvaaja.com/maharashtra-reported-895-covid-deaths/

Share this content:

Related Post