• అసోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ సహా ఏడుగురు మృతి
దర్వాజ-ఇంఫాల్
terrorist attack Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదులు దాడి చేశారు. అసోం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు మెరుపుదాడి పాల్పడ్డారు. చురచంద్‌పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో అసోం రైఫిల్స్ కమాండింగ్ అధికారి, ఆయన కుటుంబ సభ్యులు, జవాన్లు కలిపి మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే మరిన్ని భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
ఈ దాడిలో అధికారి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు సైనికులు కూడా మరణించినట్టు సమాచారం. ఇక మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ ఈ దాడిని ఖండిస్తూ.. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మణిపూర్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడి వెనుక ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
ఇదిలావుండగా, కాశ్మీర్ లోయలో క్రియాశీలంగా ఉన్న 38 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా దళాలు గుర్తించాయనీ, వారిని మట్టుబెట్టేందుకు త్వరలో సమన్వయంతో కూడిన ఆపరేషన్‌ను ప్రారంభిస్తామని బలగాలు ప్రకటించిన తర్వాతి రోజు ఈ ఘటన చోటుచేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Night Time Eating: అర్థరాత్రి తినే అలవాటు మీకుందా? అయితే ఈ ఫుడ్ మాత్రమే తీసుకోండి..
Crime: ఎంతటి అమానుషం.. సంతానం కోసం 16 నెలలుగా యువతిని బంధించి..
Air Pollution: కాలుష్యం.. ప్రపంచంలోనే టాప్‌లో ఢిల్లీ
Tulsi Gowda: అడవి తల్లి బిడ్డకు దక్కిన ‘పద్మం’.. ఆమె కథేంటీ?
పిల్లల్ని కనడంపై ఉపాసన సమాధానం ఇదే..
Kangana Ranaut: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్య్రం’ : కంగనా రనౌత్
3 Roses: నేను నీ కంటే చాలా పెద్దదాన్ని : పూర్ణ
బాబోయ్ బాలయ్య ఏంటా ఎనర్జీ.. అన్ స్టాబబుల్ స్టేజిపై బాలయ్య అదిరిపోయే స్టెప్పులు