ప్రపంచంలో జరిగే వింతలు.. విశేషాలకు అడ్డా సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని మనం ఎక్కడ ఏ విశేషం జరిగినా క్షణాల్లో స్మార్ట్ ఫోన్ లో వీక్షించవచ్చు. మనుషుల వింత అలవాట్లు.. వింత చేష్టల గురించి పక్కన పెడితే.. మూగజీవాలు చేసే వింతలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి.. కుక్కలు, ఎలుగు బంటి, చిరుత పులి, వంటి జంతువులు చేసే వింతల వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వావ్ భలే ఉందే.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వీటినే చూడటానికి జనాలు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ గ్రామంలో మేకల కాపరి తన మేకలను వెంట తీసుకెళ్తూ.. ఓ ఇంగ్లీష్ పాటను పెట్టాడు.. ఇక ఆ మ్యూజిక్ కు తగ్గట్టుగానే ఆ మేకల గుంపు స్టెప్పులు వేస్తూ.. ఆ బీట్ కు అనుగుణంగా కాళ్లను కదుపుతున్నాయి.
అందులోనూ తన యాజమానిని అనుకరిస్తూనే ఈ స్టెప్పులేస్తుండటం విశేషం. అందులోనూ.. మ్యూజిక్ కు తగ్గట్టుగా మేకలు మెడ తిప్పుతుంటే.. వాటి చెవులు బలేగా ఊగుతున్నాయి. ఒక వైపు మ్యూజిక్ ను ఆస్వాధిస్తూనే.. మరో వైపు తన యాజమానిని అనుకరించడం జనాలను ఆకర్షిస్తోంది. ఈ వీడియోను పెలియా వై ఫ్యూరియా డి యానిమల్స్ తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లైతే.. మేము ఈ మేకల డ్యాన్స్ కు ఫిదా అయ్యామని.. మేము వీటి ప్రేమలో పడ్డామని కామెంట్ చేస్తున్నారు.
మైనర్ పై లైంగికదాడి కేసు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు !
అప్పుల్లో ఆంధ్ర గట్టెక్కేది ఎట్లా ?
ప్రతి నలుగురిలో ఒకరికి చెవుడు !
Share this content: