‘ఏవమ్ జగత్’ నుంచి రాధాస్ లవ్ పాటను విడుదల చేసిన అనన్య నాగళ్ల..

vakeelsaab fame
vakeelsaab fame

దర్వాజ-సినిమా

టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన మల్లేశం సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్‌సాబ్”సినిమాలోని దివ్య నాయక్ పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ వల్ల ఈమె పలు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనన్య నాగల్లా చేతుల మీదగా   ‘ఏవమ్ జగత్’ సినిమా నుంచి “రాధాస్ లవ్” అనే పాటను విడుదల చేశారు.

దినేష్ నర్రా దర్శకత్వంలో మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి
“రాధాస్ లవ్” అనే పాటను వకీల్ సాబ్ బామ చేతులమీదుగా విడుదల చేశారు.

మీడియాపై మంచు మ‌నోజ్ ఫైర్

తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు

” ఉదయించే సూర్యిడిలా ..ప్రతిరోజు నిను చూసా .. జనియించిందే ..ఒక స్వప్నం.. “అనే పల్లవితో సాగిపోయే ఈ పాట ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్. శివ కుమార్ సంగీత సారథ్యంలో సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ ఆలపించారు. ఈ పాటను విడుదల చేసిన సందర్భంగా చిత్ర బృందానికి అనన్య శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న కాలంతో పాటు ఎంతోమంది యువకులు ఉద్యోగాలకోసం పట్టణాలలో స్థిర పడుతున్న క్రమంలో వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గిపోతుంది.ఈ క్రమంలోనే భవిష్యత్తు తరానికి అన్నం పెట్టే రైతు ఉన్నాడా…వ్యవసాయం చేయడానికి భూమి ఉందా ఉన్నా వ్యవసాయం చేసే సామర్థ్యం మన యువతకు ఉందా అనే కోణంలో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని దర్శకుడు తెలియజేశారు.

గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు

మీడియాపై మంచు మ‌నోజ్ ఫైర్

తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు

గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య

ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం

Related Post