Breaking
Tue. Dec 3rd, 2024

సచిన్ టెండూల్కర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన విరాట్ కోహ్లీ

Virat Kohli breaks Sachin Tendulkar's record

దర్వాజ – హైదరాబాద్

కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న టెస్టులో టీమిండియా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. తొలి రోజు త‌ర్వాత వ‌ర్షం కార‌ణంగా రెండు, మూడో రోజు ఆట ర‌ద్దు అయింది. నాల్గో రోజు బంగ్లాదేశ్ 107/3తో ఆటను కొనసాగించి 233 పరుగులకు ఆలౌటైంది. రెండో సెషన్ లో భారత్ బ్యాటింగ్ కు దిగి ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ విజృంభ‌ణ‌తో భారత్ మూడు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. వికెట్లు పడిపోతూనే ఉన్నప్పటికీ దాడి కొనసాగింది. టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన 100, వేగవంతమైన 150, వేగవంతమైన 200 పరుగులు సాధించిన జట్టుగా భార‌త్ నిలిచింది.

అత్యంత వేగంగా 27 వేల ప‌రుగులతో విరాట్ కోహ్లీ రికార్డు

ఈ మ్యాచ్ లోనే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 27 వేల అంతర్జాతీయ పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసి మ‌రో ఘ‌త‌న సాధించాడు. 27 ప‌రుగులు దాటిన నాలుగో క్రికెటర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ కోహ్లీ 35 బంతుల్లో 47 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ బాదాడు. లెజెండ‌రీ ప్లేయ‌ర్లు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగక్కరలతో కూడిన ప్రత్యేక క్లబ్ లో చేరాడు కోహ్లీ. అలాగే, సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టి అత్యంత వేగంగా 27,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీకి 594 ఇన్నింగ్స్ లు అవ‌స‌రం అయ్యాయి. ఇది సచిన్ టెండూల్కర్ కంటే 29 ఇన్నింగ్స్ లు తక్కువ. 2007లో 623 ఇన్నింగ్స్ ల‌లో స‌చిన్ 27 వేల ప‌రుగుల‌ను పూర్తి చేశాడు.

అత్యంత వేగంగా 27,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన క్రికెట‌ర్లు

విరాట్ కోహ్లీ * – 594 ఇన్నింగ్స్ లు
సచిన్ టెండూల్కర్ – 623 ఇన్నింగ్స్ లు
కుమార సంగక్కర – 648 ఇన్నింగ్స్ లు
రికీ పాంటింగ్ – 650 ఇన్నింగ్స్ లు

స‌చిన్ ను బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ

కాగా, విరాట్ కోహ్లీ 2023 ఫిబ్రవరిలో కోహ్లీ 25,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కోహ్లీ 549 ఇన్నింగ్స్ ల‌లో ఈ ఘనత సాధించాడు. ఇది సచిన్ కంటే 28 తక్కువ. అలాగే, స‌చిన్ కంటే 13 ఇన్నింగ్స్ లు తక్కువలోనే కింగ్ కోహ్లీ 26,000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక

అంతర్జాతీయ క్రికెట్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నారు. స‌చిన్ అన్ని ఫార్మాట్ల‌ల‌లో కలిపి 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత శ్రీలంక దిగ్గ‌జ ప్లేయ‌ర్ కుమార సంగక్కర 28,016 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్టార్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 27,483 పరుగులతో మూడో స్థానంలో, కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నారు.

Share this content:

Related Post