ధరణిన జరుగు విషమం
మానవాళికిది విపత్కరం
మట్టిన జేరును సమస్తం
విష ఘంటికల సమయం.
పచ్చని చెట్లు తరిగిపోయే
పచ్చదనమంతా కరువయ్యే
అడవులన్నీ గొడ్ఠలి వేటున
నేలరాలేను మోడు కట్టెన.
రసాయనాలు నేలన పారే
విషంబాము ఉరకలేసినట్టే
నీరు కలుషితంగా నిలిచే
రోగం నిత్యం పంచినట్టే.
కర్మాగారాల పొగ గొట్టాలు
వదిలే దుర్గంధ వాయువు
అనారోగ్యానికి కారకాలు
ఆకాశాన విషపు నాగులు.
భూదిగంతాలు విషమయం
మానవుడు చేసే విషమం
అనుభవించే విపత్కరం
నిరంతర విషన్న వదనం.
పకృతి కన్నెరగా జేయంగా
పాడు క్రిములు ఉద్భవించే
మానవలోకం తల్లడిల్లంగా
గతి తప్పిన లోకం రోధించే.
శవజాగరణతో శ్మశానాలు
ఆరని చితి సంస్కారాలు
రగులుతూ మంటల జ్వాలలు
ప్రపంచాన విషణ్ణ వదనాలు.
పచ్చని లోకం కానరాక
ధరిత్రిన విలయతాండవం
నిశీధిన ఎదురు చూపు
సంజీవని మందు కోసం.
మానవా! విశృంఖలత్వం మాను
పర్యావరణమే మేలు చేయును
చేయు హరితాహార వసుధను
జీవమిచ్చు నేల తల్లి సాగును.

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..